శుక్రవారం 05 జూన్ 2020
Rajanna-siricilla - Jan 12, 2020 , 05:28:02

టీఆర్‌ఎస్‌కే మా సంపూర్ణ మద్దతు

 టీఆర్‌ఎస్‌కే మా సంపూర్ణ మద్దతు
  • సిరిసిల్ల పట్టణ పద్మశాలీ సంఘం ఏకగ్రీవ తీర్మానం
  • తీర్మాన ప్రతిని మంత్రి కేటీఆర్‌కు అందజేసిన నాయకులు

సిరిసిల్ల టౌన్‌: అనేక సంక్షేమ పథకాల అమలుతో చేనేత కార్మికుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, ఉరిసిల్లను ‘సిరి’సిల్లగా మార్చిన టీఆర్‌ఎస్‌ పార్టీకే మున్సిపల్‌ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతిస్తామని పద్మశాలీ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ ప్రకటించారు. ఈ మేరకు సంఘ సభ్యులతో కలిసి ఏకగ్రీవంగా తీర్మానించారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను వారు శనివారం కలిసి తీర్మాణ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా పద్మశాలీ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో కేటీఆర్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నేత కార్మికుల జీవితాల్లో నూతన వెలుగులు నింపారని కొనియాడారు. బతుకమ్మ చీరెలు, పాఠశాలల యూనిఫారాలు, క్రిస్మస్‌, రంజాన్‌ దుస్తుల తయారీ ఆర్డర్లతో కార్మికులకు చేతినిండా పని కల్పించారని వివరించారు. మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్‌ వైస్‌ చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్‌, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ గాజుల నారాయణ, బొల్లి రాంమోహన్‌, మండల సత్యం, సామల దేవదాస్‌ పాల్గొన్నారు. 

క్యాలెండర్‌ ఆవిష్కరించిన అమాత్యుడు

టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ 20202ని శనివారం మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రికి టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. logo