ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - Jan 12, 2020 , 03:48:34

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌
  • -అన్ని జిల్లాలో భారీ విజయం ఖాయం
  • -టీఆర్‌ఎస్‌ బహ్రెన్‌, యూకేశాఖల అధ్యక్షులు సతీశ్‌, అశోక్‌గౌడ్‌


సిరిసిల్ల టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ విజయానికి ఎన్నారైల సంపూర్ణ మద్దతు ఉంటుందని టీఆర్‌ఎస్‌ సెల్‌ బహెరాన్‌, యూకే శాఖల అధ్యక్షులు రాధారపు సతీష్‌, దూసరి అశోక్‌గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా బహెరాన్‌, యూకే పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తామంతా టీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలిచామన్నారు. ఈ నెల 22న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయానికి ఎన్నారైలంతా సమైఖ్యంగా పని చేస్తామని ప్రకటించారు. ఎన్నారై సెల్‌లో బాధ్యులైన వారందరూ ఆయా మున్సిపాలిటీలలో ఉన్న వారివారి బంధువులు, మిత్రులందరికీ సోషల్‌మీడియా, ఫోన్‌కాల్స్‌ ద్వారా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రణాళికా పరమైన విధానాల అమలుతో మంత్రి కేటీఆర్‌కు భారీ విజయాన్ని కానుకగా అందించేందుకు శ్రమిస్తామని పేర్కొన్నారు.


logo