శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 12, 2020 , 03:46:59

ప్రశాంతంగా ‘నవోదయ’ పరీక్ష

ప్రశాంతంగా  ‘నవోదయ’ పరీక్షసిరిసిల్ల ఎడ్యుకేషన్‌: జవహర్‌ నవోదయ విద్యాలయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 1375 మంది విద్యార్థులకు గాను 1191మంది విద్యార్థులు హాజరుకాగా, 184మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. 

వేములవాడ, నమస్తే తెలంగాణ : నవోదయ ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్న త బాలుర పాఠశాల, జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో అధికారులు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడ, వేములవాడ రూరల్‌, బోయినపల్లి, కోనరావుపేటకు చెందిన 5 వతరగతి వి ద్యార్థులు 6 వతరగతిలో నవోదయ విద్యాలయం లో ప్రవేశం పొందేందుకు అర్హత పరీక్షను నిర్వహించగా మొ త్తం 324 మంది విద్యార్థులకు గాను 45 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 279 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో సీఎస్‌గా హెచ్‌ఎం ప్రమీల, బాలికల పాఠశాలలో సీఎస్‌గా రామకిషన్‌రావు వ్యవహారించారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, తాసిల్దార్‌ నక్క శ్రీనివాస్‌, బ్లాక్‌ లెవల్‌ అధికారి, మండల విద్యాధికారి కోయల్‌కార్‌ సురేశ్‌ పరిశీలించారు.