బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 12, 2020 , 03:46:12

అటవీ సంపదను కాపాడుకోవాలి

అటవీ సంపదను కాపాడుకోవాలి


ముస్తాబాద్‌: అటవీ సంపదను కాపాడుకోవాలని డీపీవో రవీందర్‌ అన్నారు. శనివారం మండలంలోని మొర్రాయిపల్లి, చీకోడు, గూడెం గ్రామాలను డీఆర్డీవో కౌటిల్య రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ ప్లాంటేషన్‌, ఇంకుడుగుంతలు, పారిశుధ్యం, శ్మశానవాటిక, డంప్‌ యార్డులు, వన నర్సరీలు, హరితహారం మొక్కల సంరక్షణను పరిశీలించారు. అనంతరం డీపీవో మాట్లాడుతూ అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలన్నారు. మామిడి, జామ, ఉసిరి, అల్ల నేరెడుతో పాటు ఇళ్ల ముందు పండ్ల మొక్కలను నాటేవిధంగా చూడాలన్నారు. ఇప్పటివరకు నాటిన మొక్కలు ఎదుగుదల తీరు బాగున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచులు సరిత, సుజాత, రజిత, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, తదిరులున్నారు.