సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 12, 2020 , 03:44:17

‘భగీరథ’ పనుల్లో వేగం పెంచండి

‘భగీరథ’ పనుల్లో వేగం పెంచండి
  • -స్టేబిలైజేషన్‌ పనులను మార్చిలోగా పూర్తి చేయాలి
  • -మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌ రెడ్డి
  • -జిల్లా మిషన్‌ భగీరథ అధికారుల బృందంతో సమీక్ష
  • -తంగళ్లపల్లి మండలంలో పనుల పరిశీలన

సిరిసిల్ల రూరల్‌: మిషన్‌ భగీరథ పనుల్లో వేగం పెంచాలనీ, మార్చిలోగా స్టేబిలైజేషన్‌ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని మిషన్‌ భగరీథ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, ఈఎన్‌సీ జి.కృపాకర్‌ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని మిషన్‌ భగరథ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ చంద్రమౌళి, జిల్లా అధికారి జానకితో కలిసి జిల్లాలో పర్యటించారు. మొదట తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్‌, మండేపల్లి శివారులోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో స్టేబిలైజేషన్‌ పనులను పరీశీలించారు. త ర్వాత జిల్లా అధికారులు, ఏజెన్సీలతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ కృపాకర్‌ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో సుమా రు రూ.130 కోట్లతో మిషన్‌ భగరథలో భాగంగా ట్యాంకులు, పైప్‌లైన్‌, నల్లా కలెక్షన్ల పూర్తిచేసి, స్వ చ్ఛమైన తాగునీరందిస్తున్నామని తెలిపారు. 359 గ్రామాల్లో మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అం దిస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు మిషన్‌ భగీరథ ద్వారా సరఫరాకు చర్యలు తీసుకున్నామని, వాటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మార్చిలోపు అన్ని స్టేబిలైజేషన్‌, మరమ్మతులు, తదితర సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. క్యూసీ ఈఈ కరుణకారెడ్డి, గ్రీడ్‌ ఈఈ రాజయ్య, డీఈఈ సుమలత, శ్రీనివాస్‌, మండేపల్లి సర్పంచ్‌ గనప శివజ్యోతి, ఏఈలు శ్రావ్య, లత, సాయిపావని, సౌమ్య, హరిప్రియ, సంతోష్‌, అనిల్‌, ప్రేమ్‌కుమార్‌, రవిశంకర్‌, సుశ్మిత, కార్యాలయ సిబ్బంది, తదితరులున్నారు.