శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Jan 10, 2020 , 11:08:30

నామినేషన్ల స్వీకరణ

నామినేషన్ల స్వీకరణ

చొప్పదండి, నమస్తేతెలంగాణ: చొప్పదండి మున్సిపల్ పరిధిలో గురువారం రెండో రోజు 13 నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌కుమార్ తెలిపారు. మొదటి వార్డులో టీఆర్‌ఎస్ నుంచి ఉసికె రాజశేఖర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా బొడిగె సురేశ్, రెండో వార్డులో టీఆర్‌ఎస్ నుంచి వల్లాల కృష్ణహరి, స్వతంత్ర అభ్యర్థిగా సిరిపురం గంగారం, నాలుగో వార్డులో కాంగ్రెస్ నుంచి చిల్ల లక్ష్మి, 5వ వార్డులో టీఆర్‌ఎస్ నుంచి బిజిలి ఎల్లవ్వ, ఆరో వార్డులో టీఆర్‌ఎస్ నుంచి వడ్లూరి గంగరాజు, 8వ వార్డులో కాంగ్రెస్ నుంచి రాజన్నల విజయ, బీజేపీ నుంచి రాజన్నల ప్రణిత, 12వ వార్డులో కాంగ్రెస్ నుంచి ముద్దం తిరుపతి, స్వతంత్ర అభ్యర్థిగా కొక్కుల రాంమోహన్, 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పెద్ది లక్ష్మి, 14వ వార్డులో కాంగ్రెస్ నుంచి వెల్మ నీలిమ నామినేషన్లు వేసినట్లు కమిషనర్ వెల్లడించారు. రెండు రోజులుగా 14 వార్డులకు గానూ 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
టవర్‌సర్కిల్: జిల్లాలోని కొత్తపల్లి మున్సిపల్‌కు గురువారం 13 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఒకటో వార్డు నుంచి పెద్ది మమత (టీఆర్‌ఎస్) 1 సెట్, 2వ వార్డు నుంచి బండ రాధ (టీఆర్‌ఎస్) 2 సెట్లు, నాల్గొ వార్డు నుంచి ఎర్రోళ్ల లహరి (టీఆర్‌ఎస్) 1, తొమ్మిదో వార్డు నుంచి చెట్టిపల్లి లత (టీఆర్‌ఎస్) 1, ముత్తునూరి పద్మ (బీజేపీ) 1, పదో వార్డు నుంచి అలువాల శ్రీధర్ (స్వతంత్ర) 2, గుళ్లపెల్లి మల్లికార్జున్ (బీజేపీ) 1, సుంకె రాజు (స్వతంత్ర), 11వ వార్డు నుంచి ఉమ్మెంతల లకా్ష్మరెడ్డి (టీఆర్‌ఎస్) 1, పన్నెండో వార్డు నుంచి పెద్ది మమత (స్వతంత్ర) 1 సెట్ నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. గురువారం మొత్తం 13 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.


logo