e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home రాజన్న సిరిసిల్ల అడవికి పునర్జీవం

అడవికి పునర్జీవం

అడవికి పునర్జీవం

వేములవాడ, మార్చి 25: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 39,117 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉండగా, గత నెల నుంచి వేములవాడ పరిధిలోని చందుర్తి-మల్యాల అటవీరేంజ్‌లో 400 హెక్టార్లు, సిరిసిల్లలో 300 హెక్టార్లలో చేస్తున్నారు. ఇందులో భాగంగా చెట్టుకు అనవసరంగా ఉన్న కొమ్మలు తొలగిస్తున్నారు. ముళ్లపొదలు చదును చేస్తున్నారు. ఎక్కువగా పెరిగిన మొక్కల్లో ఆరోగ్యవంతమైనవి గుర్తించి మిగితావి తొలగిస్తున్నారు. అడవి అగ్నికి ఆహుతి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పశువుల నుంచి కాపాడేందు కు మొక్కలకు రక్షణ కల్పిస్తున్నారు. నీటి నిల్వలు ఉండేలా చుట్టూ కందకాలు తీయిస్తున్నారు. ఖాళీస్థలాల్లో మరిన్ని మొక్కలు నాటేలా గుంతలు తీస్తున్నారు. వచ్చే వానకాలంలో 65 వేలకు పైగా రెండు మీటర్ల ఎత్తుగల మొక్కలు, హరితహారంలో భాగంగా 3 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నారు.
నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లు
అడవి ఎదుగుదలతో పాటు వన్యప్రాణుల దాహం తీర్చేందుకు నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నారు. చందుర్తి మల్యాల రేంజ్‌ పరిధిలో 10, సిరిసిల్ల అటవీ ప్రాంతంలో 10 నీటికుంటల నిర్మాణం చేపట్టారు. ఇందుకు ఒక్కోదానికి రూ.లక్ష వరకు నిధులను వెచ్చిస్తున్నారు. అలాగే, చందుర్తి మల్యాల రేంజ్‌లో కోనరావుపేట, నూకలమర్రి, రుద్రంగి, ఫాజుల్‌నగర్‌, మర్రిమడ్లలో ఒక్కొక్కటి చొప్పున ఐదు చెక్‌డ్యాములు, సిరిసిల్ల రేంజ్‌లో పరిధిలో మరో ఐదింటిని నిర్మిస్తున్నారు. వీటికి ఒక్కోదానికి రూ.5 లక్షలు వెచ్చించారు. ఇందులో మర్రిమడ్ల చెక్‌డ్యాం పూర్తి కావడమే కాకుండా అందులో నీరు నిల్వ ఉన్నది.
అడవి చుట్టూ కంచె
జిల్లాలో అడవులను రక్షించేందుకు అటవీశాఖ కంచెలు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో చందుర్తి, మల్యాల రేంజ్‌ పరిధిలో 11సీఏ బ్లాక్‌లుగా ఏర్పాటు చేసి పనులు చేస్తుండగా ఇప్పటికే, 10 బ్లాక్‌ల పరిధిలో కంచె ఏర్పాటు పూర్తయింది. దీంతో అటవీ భూమి ఆక్రమణకు గురికాదని, ఇతరులు, పశువులు చొరబడే అవకాశం ఉండదని, హద్దులు కూడా ఏర్పాటు చేసినట్లు ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
పెరిగిన అటవీ విస్తీర్ణం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 37,617 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కోల్పోయిన భూమికి గానూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అటవీ శాఖకు 1500ల హెక్టార్లను అప్పగించింది. దీంతో అటవీ విస్తీర్ణం జిల్లాలో 39,117 హెక్టార్లకు పెరిగింది.
ప్రకృతిని పెంచేలా పనులు
అడవి సహజంగానే పెరుగుతున్నప్పటికీ చెట్లను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పునర్జీవం పేరిట పనులు చేపట్టింది. చందుర్తి-మల్యాల రేంజ్‌ పరిధిలో 8 చోట్ల 400 హెక్టార్లలో పనులు చేస్తున్నాం. భవిష్యత్‌ తరాలకు పచ్చదనాన్ని అందించేలా, ప్రకృతిని పెంచేలా పనులు జరుగుతున్నాయి. వచ్చే వానకాలంలో భారీగా మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాం.

  • వేణుగోపాల్‌, ఫారెస్టు రేంజ్‌ అధికారి, చందుర్తి మల్యాల రేంజ్‌, వేములవాడ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అడవికి పునర్జీవం

ట్రెండింగ్‌

Advertisement