హెర్బల్ మందులతో మిరపలో వైరస్‌కు చెక్

Thu,October 17, 2019 12:44 AM

upward-curling
రాష్ట్రంలో వానకాలం, యాసంగి కాలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న కాయగూర, సుగంధ ద్రవ్య పంట మిరప. కూర మిరపగా, ఎండు మిరప కోసం సాగు చేస్తున్నారు. అయితే మిగతా పంటలతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో ఈ పంటను పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తున్నాయి. రైతులు వీటి నివారణకు రసాయన మందులు వాడుతున్నారు. దీనివల్ల రసాయన పురుగు మందుల అవశేషాలు ఉండి, వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నది. పచ్చి మిరపలో, ఎండు మిరపలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. అయితే ఇటీవల వచ్చి న సేంద్రియ సాగు విధానాలు రసాయన పురుగు మందుల అవశేషాలు లేని మిరప ఉత్పత్తులకు బాటలు వేస్తున్నాయి. ముఖ్యంగా మిరప పంటను తొలిదశలో అంటే నర్సరీ దశ నుంచి ఆశించి నష్టపరిచే వైరస్ తెగుళ్ల నివారణకు విపరీతంగా వాడుతున్న రసాయన పురుగు మందుల స్థానం లో వృక్షాల నుంచి సేకరించిన హెర్బల్ పురుగు మందులు మంచిగా పనిచేస్తున్నాయి. అటు పర్యావరణానికి హాని కలిగించకుండా, రసాయన అవశేషాలు లేని ఉత్పత్తులను అందించడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి.

ఆకు ముడత

మిరపలో ప్రధానంగా మూడు వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉన్నది. ఈ ఆకు ముడత జెమిని వైరస్ ఆశించడం వల్ల వస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారుతాయి. పైకి ముడుచుకుని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకు ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చరంగు కలిగి ఉంటాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.

మొవ్వకుళ్లు తెగులు

దీనినే పీ నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అంటారు. ఈ వైరస్ ఆశించిన మొక్కల చివర్లు ఎండిపోతాయి. కాండంపై నల్ల ని నిర్దిష్ట ఆకారంలేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

కుకుంబర్ మొజాయిక్ వైరస్

ఈ వైరస్ ఆశించిన మిరప మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది. ఆకులు పత్రహరితం కోల్పోతాయి. ఆకారం మారిపోయి కొనలు సాగి, మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. పూత, కాత ఉండదు. ఈ వైరస్ పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది.

వ్యాప్తి

సాధారణంగా వైరస్ తెగులు నీటి ఎద్దడి ఉన్నప్పుడు, పొడి వాతావరణంలో ఎక్కువగా ఆశిస్తాయి. నత్రజని ఎరువులు ఎక్కువగా వాడటం, కలుపు మొక్కలు ఎక్కువగా ఉండి వైరస్‌లకు ఆశ్రయాలుగా ఉంటాయి. దీంతో వీటి ఉధృతి పెరుగుతుంది.

నివారణ

సేంద్రియ సాగులో రసాయన పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉండేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి.
1. వేప గింజల కషాయాన్ని 5 శాతం చొప్పున వాడవచ్చు. వేపనూనెను పిచికారీ చేయవచ్చు. సేంద్రియ ఎరువులు వాడాలి.
2. గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో ఉంచితే తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. వైరస్ సోకిన మొక్కలను గుర్తించి పీకి పారేయ్యాలి.
3. గట్లమీద వైరస్‌కు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. పొలం చుట్టూ 2,3 వరుసలలో సజ్జ, జొన్న, మక్కజొన్నలను రక్షణ పంటలుగా వేసుకోవాలి.

హెర్బల్ పురుగు మందులు

మొక్కల నుంచి మాత్రమే సేకరించి అన్ని వైరస్‌లను సమర్థవంతంగా నివారణ చేయగలిగే హెర్బల్ పురుగు మందులు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయి. రసాయన పురుగు మందుల కంటే సమర్థవంతంగా పనిచేస్తూ, తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇవి వాడిన ఉత్పత్తులకు మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తులుగా ప్రిమియం ధర ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. ఈ రకం పురుగు మందుల అదనపు వివరాల కోసం 9177178001లో సంప్రదించవచ్చు.

ఆసరి రాజు

హెర్బల్ మందులనే వాడుతున్నా మిరపలో వైరస్ తెగుళ్ల సమస్య విపరీతంగా ఉన్నది. రసాయన పురు గు మందులు వాడేటప్పుడు ప్రతి సంవత్సరం మోతాదు పెంచాల్సి వచ్చేది. స్టాప్ వైరస్ హెర్బల్ పురుగు మందు తో వైరస్ నివారణ సులభం. ముందస్తుగా పిచికారీ చేస్తూ అసలు వైరస్ ఆశించడమే లేదు. మేము ఈ మందులు వాడి సేంద్రియ మిరపగా అమ్ముతూ అధిక ధరలు పొందుతున్నాము. నేను వేసే అన్ని పంటలలో వైరస్ తెగుళ్ల నివారణకు స్టాప్ వైరస్ హెర్బల్‌నే వాడుతున్నాను.
-వెలది పురుషోత్తం రావు, 7901217777, సేంద్రియ రైతు

348
Tags

More News