సేంద్రియ ఎరువులతో వరి సాగు

Wed,February 20, 2019 10:45 PM

ఈ రోజుల్లో ఏ పంట సాగు చేసినా రసాయన ఎరువులు వాడటం సాధారణ మైపోయింది. ఈ పరిస్థితుల్లో పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడుతూ వరి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ దంపతులు. మునుపెన్నడూ వేయని వంగడాలను ఎంచుకొని వాటితో ప్రయోగాత్మకంగా 10 పది గుంటల్లో వేసి ఆశించిన దిగుబడి సాధించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
organic-paddy
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలోని వినయ్‌నగర్‌కు చెందిన చాకినాల భూమన్న, లక్ష్మి దంపతులు. గత వానకాలంలో వారికి ఉన్న పది ఎకరాల భూమిలో ప్రయోగాత్మకంగా 10 గుంటల భూమిలో ఈ ప్రాంతంలో ఇప్పటివరకు పండించని మైసూర్ మల్లిక, తులసి బాస్మతి, బెలినోల్ల, బర్మా బ్లాక్, నౌహారా లాంటి వంగడాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ఒక్కో రకం విత్తనాన్ని వంద గ్రాముల చొప్పున వేశారు. ఈ పంటల సాగుకు జీవామృతం, వర్మీ కంపోస్ట్, వేస్ట్ డీ కంపోస్ట్ ఎరువులను మాత్రమే వాడారు. వీరు పండించిన పంట వల్ల ఆరోగ్యకరమైనవి. సాగు చేసిన మైసూర్ మల్లిక వంగడం చిన్నపిల్లలకు పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది.

organic-paddy2
అలాగే సాంబ విత్తనం మంచి పోషక విలువలు కలిగి ఉంటుంది. తులసి బాస్మతి ధాన్యం సుగంధ వాసన వస్తుందని వారు తెలిపారు. బెలినోల్ల ధాన్యంలో పౌష్టికాహారానికి ఉపయోగపడే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బర్మా బ్లాక్ ధాన్యం షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడతుందని పేర్కొన్నారు. పూర్తి సేంద్రియ ఎరువులతో కొత్త వంగడాలను సాగు చేయలనే ఆసక్తిగా ఉన్న రైతులు తమను సంప్రదిస్తే విత్తనాలను అందజేస్తామని వారు తెలిపారు. కొత్త వంగడాలతో రసాయన అవశేషాలు లేని సేంద్రియ సాగు చేస్తున్న భూమన్న, లక్ష్మి దంపతులను అందరూ అభినందిస్తున్నారు.

-గాజుల లింగన్న, 9441837236,
జన్నారం రూరల్, మంచిర్యాల జిల్లా

1317
Tags

More News