కాయగూరల పంటల సంజీవని మైక్రోబియల్ కన్సార్సియా

Wed,January 30, 2019 10:36 PM

రాష్ట్రంలో ఏడాదంతా కాయగూరలు సాగులో ఉంటున్నాయి. పంటలు ఏపుగా పెరిగి, మేలైన దిగుబడులు రావడంలో మొక్కల ఆరోగ్యం ముఖ్యం. దీనికి రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రసాయన అవశేషాల నేపథ్యంలో వాటి వాడకం సిఫార్సు కాదు. కేవలం పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులతో బెంగళూరులోని IIHR తయారుచేసిన మైక్రోబియల్ కన్సార్సియా రైతుల ఆదరణ చూరగొన్నది. సేంద్రియ ఎరువుగా, తెగులు శిలీంధ్ర ఇది నాశనిగా దీన్ని వాడవచ్చు.
bio-mic
అర్కా మైక్రోబియల్ కన్సార్సియ (AMC) బయోమిక్ ఎన్‌పిజడ్‌కే పేరుతో ఉంటుంది. దీనిలో NPZ ఉంటాయి. లిగ్నైట్ ఆధారిత సూక్ష్మజీవిక ఉత్పత్తి. దీనిలో నత్రజనిని స్థాపించే భాస్వరం, జింకును కరిగిం చే బ్యాక్టీరియాతో పాటు మొక్కల పెరుగుదలకు కూడా తోడ్పడే బ్యాక్టీరి యా ఉంటుంది. ఈ ఉత్పత్తిని విత్తనా లు, నేలలు, నీటిలో కలిపి లేదా నర్సరీలో సైతం నేరుగా వాడుకోవచ్చు.

వాడే పద్ధతులు

విత్తనశుద్ధి: 20 మి.లీ వండిన బియ్యం జిగురుతో 10-20 గ్రాము ల ఉత్పత్తిని కలిసి స్లర్రీగా తయారు చేయాలి. ఇలా తయారైన స్లర్రీని 100-200 గ్రాముల విత్తనానికి పట్టించి విత్తుకోవచ్చు. విత్తనాలను స్లర్రీ సమానంగా పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విత్తనాలను 30 నిమిషాల వరకు నీడలో ఆరబెట్టి, 24 గంటలలోపు పొలంలో విత్తుకోవాలి.

కొబ్బరిపీచుతో వాడకం

బయోమిక్-ఎన్‌పిజెడ్‌కేను కొబ్బరిపీచును పోషక సహితంగా చేసేందుకు సైతం వాడుకోవచ్చు. వెయ్యి కిలోల కొబ్బరి పీచుకు ఒక కిలో బయోమిక్ సిఫార్సు చేయబడింది. లేదా ఒక కిలో కొబ్బరి పీచుకు 20 గ్రాముల బయోమిక్ ఉత్పత్తితో పిచికారీ చేసి వాడుకోవచ్చు. ఇలాంటి శుద్ధి తర్వాత రాత్రంతా ఉంచి, ప్రోట్రేలలో వాడితే మేలైన ఫలితాలుంటాయి.

నేలలో వాడటం

ఎకరంలో పంటను వేసేందుకు గాను ఐదు కిలోల బయోమిక్ అవసరం ఉంటుంది. నర్సరీలో పెంచి, ప్రధాన పొలంలో నాటే పంటలకు అయితే, లీటరు నీటికి 20 గ్రాముల కన్సార్సియాను కలిపి, ఆ తర్వాత ప్రధాన పొలంలో పంటను నాటిన 10 వ రోజు వేరు వ్యవ స్థ దగ్గరలో వేయాలి. నేరుగా నాటే పంటలైతే, నాటిన 4 నుంచి 7వ రోజుల్లో వేరు వ్యవస్థలో వేయాలి.

ప్రధాన పొలంలో వాడటం

ఎకరా ప్రధాన పొలంలో నాటేందుకు అవసరమయ్యే పంటకు గాను ఐదు కిలోల బయోమిక్ కన్సార్సియం అవసరం. 500 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువుతో ఐదు కిలోల కన్సార్సియం బాగా కలిసేలా కలిపి పొలంలోని మొక్కల వేరు వ్యవస్థలో వేయాలి. అదేవిధంగా, పొలం తయారీ సమయంలో సైతం వేయవచ్చు.

కన్సార్సియం వాడకంతో ఉపయోగాలు

విత్తన మొలక శాతాన్ని పెంచుతుంది. మొక్కల పెరుగుదలను ఎక్కు వ చేస్తుంది. పైన పేర్కొన్న విధంగా వాడితే, నత్రజని, భాస్వరం వాడకంలోని 25 శాతం ఎరువులను ఆదా చేస్తుంది. పంటల ఉత్పాదకత పెంచుతుంది.

కన్సార్సియం నిల్వలో కిటుకులు

బ్యాక్టీరియా ఆధారిత కన్సార్సియం కాబట్టి తయారీ దగ్గరి నుంచి పంటలకు వాడే వరకు వాటి సంఖ్య తగ్గకుండా నిల్వలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితంగా పొడిగా ఉండే చల్లని ప్రాంతాల్లో నిల్వ ఉంచాలి. సూర్యరశ్మి నేరుగా ఉత్పత్తులపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి.

సేంద్రియ సేద్యానికి ఊతం

అర్కా మైక్రోబియర్ కన్సార్సియం శుద్ధమైన జీవన పదార్థం. దీనితో అసలు రసాయనాలు ఉండవు. ఇందులో ఉండే మూడు రకాల బ్యాక్టీరియా పూర్తి సేంద్రియ సాగుకు అత్యంత ఉపయోగం. నత్రజని స్థాపన, భాస్వరం, జింకు కరిగించే శక్తి ఉండే బ్యాక్టీరియాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి జీవన ఎరువులుగా అదే విధంగా సస్యరక్షణ జీవన పురుగు మందుగా కన్సార్సియం ఉపయోగపడుతుంది. వివిధ విశ్వవిద్యాలయాలు ఈ తరహా కన్సార్సియా తయారుచేసి, విక్రయిస్తున్నప్పటికీ అర్కా ఉత్పత్తులకు నాణ్యత ఎక్కువ.

ఈ కన్సార్సియా తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించగలదు. కూరగాయలలో నారుకుళ్లు, మొదలు కుళ్లు ఫ్యుజేరియం ఎండు తెగుళ్లను నియంత్రిస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియా ఎండుతెగులు, ఇతర పంటలలో ఎండుతెగుళ్లను కూడా సమర్థవంతంగా నియంత్రించగలుగుతుందన్న పరిశోధన ఫలితాలు ఉన్నాయి.

అర్కా మైక్రోబియల్ కన్సార్సియం బయోమిక్ ఎన్‌పిజెడ్‌కే పేరుతో బెంగళూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ విక్రయిస్తుంది. వారి నుంచి ఆమోదం, లైసెన్స్ పొందిన ప్రైవేటు విక్రయదారులు సైతం రాష్ట్రంలో వివిధ పేర్లతో విక్రయిస్తున్నారు. రాష్ట్రం లో ప్రస్తుతం విక్రయిస్తున్న వారిని 09148928714 లేదా 09177178001, [email protected] సంప్రదించవచ్చు
dr-p-saidaiah

బయోమిక్ అర్క మైక్రోబియల్ కన్సారియం

bio-mic2
ఈ ద్రవరూప సూక్షజీవిక ఉత్పత్తిలో నత్రజనిని స్థాపించే, భాస్వరం, పొటాషియం, జింక్‌లను కరిగించి మొక్కకు అందించే బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇది పూర్తిగా నీటిలో కరుగుతుంది. ఈ ఉత్పత్తిని విత్తనశుద్ధికి, నారుమడికి, నేలలో నీటిలో కలిపి నేరుగా వాడవచ్చు.

వాడే పద్ధతులు

విత్తనశుద్ధి: 20 మి.లీ బయోమిక్ ఉత్పత్తిని 20 మి.లీ బియ్యం గంజితో కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో 200 గ్రాముల విత్తనాలను పట్టించి, 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి, 24 గంటలలోగా విత్తుకోవాలి. ఈ మిశ్ర మం విత్తనాలకు సమానంగా పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కొబ్బరిపీచుతో వాడకం

లీటరునీటికి 20 మి.లీ. బయోమిక్-ఎన్‌పీజడ్ కలిపి, 1000 కి.గ్రాల బాగా చివికిన కొబ్బరిపీచుపై చల్లుకోవచ్చు. ఇలా చేస్తే చివికిన కొబ్బరిపీచు మరింత పోషక సహితంగా మారి, నారు ఆరోగ్యంగా, త్వరగా పెరుగుతుంది. ఈ విధంగా తయారుచేసుకున్న కొబ్బరిపీచు (కోకోపీట్)ను వాడితే, నర్సరీ దశలో వచ్చే వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లను అరికట్టవచ్చు. కూరగాయలు/పండ్లు/పూల మొక్కల నారు త్వరగా నాటడానికి సిద్ధమవుతుంది.

నేలలో వాడటం (సాయిల్ డ్రైంచింగ్)

ఎకరంలో పంటను వేసేందుకు గాను, మూడు లీటర్ల బయోమిక్ అవసరం. నర్సరీ పెంచి, ప్రధాన పొలంలో నాటే పంటలకు అయితే ప్రధాన పొలంలో పంటను నాటిన నాలుగు లేదా ఏడు రోజుల్లోపు దీన్ని వేరు వ్యవస్థ దగ్గర రోజ్‌క్యాన్‌తో పొయ్యాలి.

ప్రధాన పొలంలో వాడటం

ఎకరా ప్రధాన పొలంలో నాటేందుకు అవసరమయ్యే పంటకు గాను మూడు లీటర్ల బయోమిక్ కన్సారియం అవసరం. 500 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువుతో మూడు లీటర్ల కన్సార్సియం బాగా కలిసేలా కలిపి పొలంలోని మొక్కల వేరు వ్యవస్థలో వేయాలి. అదేవిధం గా పొలం తయారీ సమయంలోనూ వేయవచ్చు.

ఫెర్టిగేషన్

డ్రిప్ సిస్టంలో, ఫెర్టిగేషన్ ట్యాంకులో 200 లీటర్ల నీటికి 3 లీటర్ల ద్రవరూప బయోమిక్ ఎఎమ్‌సి కలిపి, డ్రిప్ ద్వారా మొక్కల పాదుల్లో అందించవచ్చు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇలా అందివ్వాలి.
-ద్రవరూప బయోమిక్ ఉత్పత్తి 100 శాతం నీటిలో కరుగుతుంది. కాబట్టి డ్రిప్ నాజిల్స్ మూసుకుపోయే సమస్య ఉండదు.
-డ్రిప్ ద్వారా అందించడం వల్ల కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు.
-చాలా త్వరగా ఫలితాలు వచ్చి, అధిక దిగుబడులు రాబట్టవచ్చు.

1905
Tags

More News