గోరుచిక్కుడులో తెగుళ్లను నివారణ

Thu,September 20, 2018 01:22 AM

గోరుచిక్కుడులో ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యల గురించి ఉద్యానవన విశ్వవిద్యాలయం సంచాలకులు, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. విజయ సూచించారు. గోరు చిక్కుడులో ప్రస్తుతం పేనుంబక, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగుళ్ల ఉధృతి ఉన్నది. వాటిని సకాలంలో గుర్తించి దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు.

WYGF

పేను బంక

పెద్ద , చిన్న పురుగులు లేత చిగుళ్లు , ఆకుల నుంచి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. వాటిని పరిశీలించి డైమిథోయేట్ లేదా మెటసిస్టాక్స్ లేదా ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ 2.మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు

ఈ తెగులు వల్ల ఆకులపైన తెల్లని పొడి పదార్థం ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువై పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి 3గ్రా. లేదా కెరాథేన్ 1మి.లీ , హెక్సా కొనజోల్ 2.మి .లీ లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

ఆకు మచ్చ తెగులు

ఈ తెగులు సోకితే ఆకులపై నల్లని మచ్చలు ఏర్పడుతాయి. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడి రాలిపోతాయి. నివారణకు డైథేన్ యం-45ను 2.5 గ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.ముందస్తు చర్యగా ఎండు తెగులు సోకకుండా ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాములు కిలో విత్తనంతో విత్తనశుద్ధి చేసుకోవాలి.
-మాసయ్య వ్యవసాయ యూనివర్సిటీ, 9000377929

680
Tags

More News