వరి, మక్కజొన్నలో చేపట్టాల్సిన చర్యలు

Wed,August 29, 2018 11:25 PM

రాష్ట్రంలోని రైతులు సాగునీటి లభ్యతను బట్టి ముఖ్యంగా బోర్లు, బావులు, మీద ఆధారపడి వానకాలంగా పంటగా వరిని జూన్ మాసంలో నార్లు పోసి జూలైలో నాటుకున్నారు. ప్రాజెక్టుల కింద కూడా బోర్లు, బావులు ఉన్నవారు నార్లు పోసుకుని నీటి లభ్యతను బట్టి కొంతమేర నాట్లు వేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధిక వానల వల్ల ముందు నాటిన వరి పైర్లు ముంపునకు గురై, కొట్టుకుపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో వరితో పాటు మక్కజొన్న సాగులో అవలంబించాల్సిన యాజమాన్య పద్ధతులను గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి వివరించారు. ఈ పంటల సాగుపై అదనపు సమాచారం కోసం 9440481279 నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ పంటల సాగు గురించి ఆయన అందించిన వివరాలు..

వరి సాగులో గుర్తుంచుకోవాల్సినవి

paddy
-ప్రస్తుతం వానలు కురిసి ప్రాజెక్టులు, చెరువు లు, కుంటలు నిండాయి. కానీ ఈ తరుణంలో వరినార్లు పోసుకొని నాట్లు వేసే ఆలోచన రైతు లు చేయరాదు. ఒకవేళ వరినాట్లు వేయదలిస్తే ఇప్పుడు నార్లు పోసి సెప్టెంబర్ చివరిలో నారు నాటినైట్లెయితే చీడ,పీడల ఉధృతి పంటలపై ఎక్కువగా ఉంటుంది. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. యాసంగి పంట సాగుకు కూడా ఆలస్యం అవుతుంది.
-ఇతర వరిసాగు పద్ధతి అయిన డ్రమ్ సీడర్‌తో నేరుగా తయారు చేసిన పొలంలో ఒకరోజు మండె కట్టిన విత్తనాన్ని విత్తుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ విత్తిన వెంటనే వాన పడకపోతే విత్తనం వండులో కూర్చకపోయి మొలక బయటకు రాదు. మళ్లీ విత్తవలసి ఉంటుంది.
-మొలకెత్తిన విత్తనం ప్రధాన పొలంలో వెదజల్లే పద్ధతిని అనుసరించి కూడా వరిసాగు చేయవచ్చు. కానీ ఈ పద్ధతిలో సాగు చేసినా కూడా విత్తనాలు వండు కూరకపోయే అవకాశం ఉంటుంది. ఆలస్యమైనందున తక్కువ పంటకాలం గల రకాలను ఎన్నుకోవాలి. ఈ పద్ధతిలో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది.
-రైతులు రెండో పంటగా నవంబర్ మొదటి పక్షంలో నార్లు పోసుకుని డిసెంబర్ మొదటి పక్షంలో నాటుటకు ఆలోచన చేయడం మంచిది.

వరిలో చేపట్టాల్సిన చర్యలు

-వానలతో పొలంలో నిలిచిన నీటి తీసివేయా లి. అదే బాగా వంపు పొలాలు అయితే ఆరబెట్టడం ఉత్తమం.
-సల్ఫైడ్ హాని (గంధక విష ప్రభావం): మురుగు నీరు పోని చోట ఇనుము తక్కువగా ఉన్న నేలల్లో ఆమ్ల సల్ఫేట్ నేలల్లో ఇది కన్పిస్తుంది. లేత ఆకులు పత్రహరితాన్ని కోల్పో యి వేర్లు సరిగా పెరుగక నల్లగా మారుతాయి. వేర్లులాగి చూస్తే కోడిగుడ్ల వాసన వస్తుంది. దీని నివారణకు మురుగు నీటిని తీసివేసి మొక్కలకు గాలి ఆడేటట్లు చూడాలి. లేకపోతే మొక్కలు ఎండి చనిపోతాయి. ఈ నేలల్లో భాస్వరం, పొటాష్, ఎరువులు ఎక్కువగా వేసుకోవాలి. అలాగే జూన్ నెలలో నార్లు పోసి జూలై నెలలో నాటిన వరిపైర్లు దుబ్బు చేసే దశలో ఉన్నా యి. ఈ దశలో పొలంలో నీరు 2.5 సెం. మీటర్లకు మించి ఉండరాదు. అడపాదడపా పొలాలలను ఆరబెట్టడం వల్ల పంట ఆరోగ్యంగా పెరుగుతుంది.
-లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలను అమర్చి పురుగుల ఉధృతిని గమనించాలి. పొలంలో పొలం గట్లపై కలుపు లేకుండా చూడాలి. చీడపురుగులు, మిత్రపురుగులు అంచనా వేసుకుని అవి 2:1 దాటితేనే పురుగుమందులు వాడాలి. వేప సంబంధిత పురుగు మందులు వేపనూనె, వేపకాషాయాన్నిపిచికారీ చేసి తొలి దశలోనే నియంత్రించుకోవాలి.
-కాండం తొలిచే పురుగు ఆశించి 5 శాతం కంటే ఎక్కువగా మొవ్వులు చనిపోతే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణకు పైపాటుగా అయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బోప్యూరాన్ 3జీ 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు ఎకరాకు ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
-ఆకుముడత పురుగులు ఆశించి ఆకులు తెల్లబడి ఎండిపోతాయి. నష్టపరిమితి స్థాయిని అంచనా వేసుకుని (2 కంటే ఎక్కువ పురుగులు సోకిన ఆకులు) కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రాములు లీటర్ నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
-తాటాకు తెగులు ఆకులలోని పత్రహరితాన్ని గోకి తిన డం వల్ల ఆకులపై తెల్లటి చారలు ఏర్పడి ఎండిపోతా యి. నివారణకు క్లోరో పైరిఫాస్ 20 ఇసి 2.5 మి.లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
-తామర పురుగులు ఆకుకొనలను ఆశించి రసం పీల్చివేయడం వల్ల ఆకు కొనలు ముడుచుకుని సూది మొనలలాగా కనిపిస్తాయి. ఈ పురుగులు నివారణకు డైకోఫాల్ ఎకరాకు 600 మి.లీలు పిచికారీ చేయాలి.
-పాము పొడ తెగులు పిలకలు పెట్టే దశ నుంచి చివరి దశ వరకు ఆశిస్తుంది. నీటిమట్టం నుంచి ఆకులపై, కాండంపై పాముపొడ లాంటి మచ్చలేర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు పైరు పూర్తిగా ఎండిపోతుంది. దీని నివారణకు ప్రాపికొనజోల్ 1 మి. లీ లేదా హెక్సాకొనజోల్ 2.0 మి.లీ లేదా వ్యాలిడామైసిన్ 2.0 మి.లీ లు లీటర్ నీటికి కలిపి పొలంలో నీటిని తీసివేసి మొద ళ్ళు తడిసేలా పిచికారీ చేసుకోవాలి.
-అగ్గితెగులు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి వర్షపు జల్లులు పడుతున్నప్పుడు నత్రజని ఎరువు బాగా వేసినప్పుడు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుం ది. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసో ప్రొథయోల్ 1.5 మి. లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
-నట్టె కోటేశ్వర్‌రావు
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా, 9989944945

మక్కజొన్న

maize
-వానకాలం పంటగా విత్తిన మక్కజొన్న పంట పుష్పించే దశలో ఉన్నది. ఈ దశలో సిఫారసు చేసిన నత్రజని మోతాదు 24-32 కిలోలు ఎకరాకు పంటకు వేయాలి.
-వర్షాధారంగా సాగు చేసిన మక్కజొన్నకు నీరు ఉన్నచోట బెట్ట పరిస్థితులను బట్టి నీటితడులు ఇవ్వాలి. మోకాలి ఎత్తు దశ, పుష్పించే సమయం, గింజనిండుకునే సమయంలో బెట్ట పరిస్థితులకు గురికాకుం టే వర్షాధారంగా కూడా మంచి దిగుబడు లు పొందవచ్చు. పూతదశలో నీటి ఎద్దడి లేకుండా ఉన్నైట్లెతే కాండం కుళ్ళును నియంత్రించవచ్చు.
-ఆకు ఎండు తెగులు అదుపునకు 2.5 గ్రాములు మాంకోజెబ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పాముపొడ తెగులు అదుపునకు ప్రాపికొనజోల్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. భూసార పరీక్షలకు అనుసరించి ఎరువులు వేయాలి. ఎరువులు వేసుటప్పుడు భూమిలో తగిన తేమ ఉండాలి.
-మక్కజొన్నలో పోషక సమస్యలు పూత దశలో, పిందె దశలో ఏర్పడితే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.
-ముఖ్యంగా మక్కజొన్నలో జింక్, ఇను ము, మాంగనీస్, బోరాన్ లోపం బాగా కనిపిస్తాయి. ఈ లోపాల నివారణకు సిపారసు చేసిన మోతాదులో సూక్ష్మపోషకాలు పూతకు పది రోజల ముందు నుంచి మొదలుకుని 20-25 రోజుల వరకు వాడి నివారించి అధిక దిగుబడులను పొందవచ్చు.

663
Tags

More News