గొర్రె పిల్లల సంరక్షణ

Wed,August 29, 2018 11:21 PM

sheep-mother
పరాన్న జీవుల కారణంగా వచ్చే వ్యాధులతో పుట్టిన కొన్నిరోజులకే గొర్రె పిల్లలు మృత్యువాత పడుతుంటాయి. ఇవి వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి. గొర్రె పిల్ల పుట్టిన వెంటనే మొదటి 30 నిమిషాల్లోగా తల్లిపాలు తాగించాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి వస్తుంది. 15 రోజుల వయసు వచ్చిన తర్వాత మిశ్రమ దాణా తల్లిపాలతోపాటుగా శరీర బరువులో ఒక శాతం అందించాలి. నెల వయసు వచ్చినప్పటి నుంచి వాటికి సులభంగా జీర్ణమయ్యే ఆకులు తినిపించాలి. దీనివల్ల పిల్లకు 45 రోజుల వయసు వచ్చే సరికి వాటిలో జీర్ణకోశ వ్యవస్థ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుంది. గొర్రె పిల్లలను చిటుకు రోగం, నల్లబాటు, పారుడు రోగం నుంచి రక్షించుకోవాలి. రెండు నెలల వయసులో మొదటిసారి నట్టల మందు తాగించిన 3 నుంచి 7 రోజుల్లో పు చిటుకు రోగం టీకాలు వేయించాలి. 15 రోజుల తర్వాత నల్లబాటు టీకాలు, మరో 15 రోజుల తర్వాత పారుడు రోగం టీకాలు వేయించాలి.

685
Tags

More News