పంటల్లో పోషక లోపాలు-నివారణ

Wed,August 22, 2018 10:44 PM

రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటల్లో ప్రధాన సూక్ష్మధాతు పోషక లక్షణాలు కన్పిస్తున్నాయి. వీటిని సకాలంలో నివారిస్తే దిగుబడి, నాణ్యత పెరుగుతుంది.
paddy
వరిలో.. ఆకులు పసుపు రంగులోకి మారితే నివారణకు ఒక శాతం సూపర్ ఫాస్ఫేట్ 0.5 శాతం ఫెర్రస్ సల్ఫేట్ పిచికారీ చేయాలి.
-పూత అస్తవ్యస్తంగా ఉండి, గింజలు తాలు పోతుంటే ఒక శాతం సూపర్ ఫాస్ఫేట్, ఒక శాతం మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. మొక్కల చివర్లు ఎండిపోయి, ఆకుల అంచులు చిట్లి, గోధుమ రంగులోకి మారితే నివారణకు ఒక శాతం సూపర్ ఫాస్పేట 0.5 శాతం జింకు సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.
-మక్కజొన్నలో.. ఆకులు పసుపు రంగులోకి మారితే 0.5 శాతం ఫెర్రస్ సల్ఫేట్, 0.5 శాతం యూరియాతో కలిపి పిచికారీ చేయాలి.
-తెల్ల మొగ్గలు ఏర్పడి, మొగ్గల ఆకులు రంగు మారితే నివారణకు 0.5 శాతం జింకు సల్ఫేట్‌ను ఒక శాతం యూరియాతో కలిపి పిచికారీ చేయాలి. మొక్క చిగుర్లు ఎండిపోయి, ఆకుల చివర్లు చిట్లి, ముదురు ఆకులు గులాబీ రంగులోకి మారితే ఒక శాతం సూపర్‌ఫాస్ఫేట్‌ను 0.5 శాతం జింకు సల్ఫేట్‌తో కలిపి పిచికారీ చేయాలి.
-కేవలం ఆకుల అంచులు చిట్లి, పసుపు రంగులోకి మారితే నివారణకు ఒకశాతం యూరియాను 0.5 ఫెర్రస్ సల్ఫేట్‌తో కలిపి పిచికారీ చేయాలి.
-చివర్ల, అంచులు అస్తవ్యస్తంగా ఎండిపోతే హెక్టారుకు 25 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి.
-జొన్నలో.. మొక్కలో లేత ఆకులు ముదురు రంగులోకి పాలిపోతే 0.5 శాతం ఫెర్రస్ సల్ఫేట్ 0.5 శాతం యూరియాను 0.5 శాతం అమ్మోనియం సల్ఫేట్‌తో కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు.
-వేరుశనగలో.. మొక్క చిగురాకులు రంగు మారితే 0.5 శాతం ఫెర్రస్ సల్ఫేట్‌ను ఒక శాతం యూరియా తో కలిపి పిచికారీ చేయాలి.
amarapalli-geetha

542
Tags

More News