కాసులు కురిపిస్తున్న కంది

Thu,August 16, 2018 12:47 AM

మెట్ట ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటల్లో ముఖ్యమైనది కంది. కంది ఏడాది పొడవున కాసే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పత్తికి ప్రత్యామ్నాయంగా కంది సాగు చేయాలని సూచిస్తున్నది. దీంతో గత ఏడాది కంది సాగు చేసి మంచి ఫలితాలు సాధించారు. త్వరగా కోతకు వచ్చే కొత్త వంగడాలు మార్కెట్‌లోకి వచ్చాయి. కందిలో అంతర పంటలు వేసుకుని ఆ పంట కోసిన తర్వాత నీరందిస్తే రెండవ పంట చేతికి వస్తుంది. అలాగే సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
rairgu
రాష్ట్రంలోని ఎర్ర, ఇసుక నేలల్లో కంది సాగు అనుకూలం. రాష్ట్రంలో దాదాపు 2.95 లక్షల హెక్టార్లలో సాగైంది. ప్రధానంగా మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్,జోగులాంబ గద్వాల, సూర్యపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట ,నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తారు. మచ్చపురుగు, శనగ పచ్చపురుగు, గొడ్డు మోతు తెగు లు, కాయతొలిచే ఈగ, ఈక రెక్కల పురుగు సోకే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన సమాచార అధికారి వేణుగోపాల్ రెడ్డి రైతులకు సూచించారు.

మారుకా మచ్చల తెగులు ..


గుడ్డు నుంచి వెలువడిన లార్వా లేత ఆకులను, పూ మొగ్గలను, పిందెలను కలిపి గూడుగా అల్లి లోపలే దాగి నాశనం చేస్తుంది. పిందెలకు, కాయలకు అడుగు భాగంలో రంధ్రం చేసి లోపలికి వెళ్లి గింజలను తింటుంది. పురుగు ఆశించిన కాయలు అవి విసర్జించిన పదా ర్థం తోనూ, కట్టిన గూళ్లతోను బూజు లా కనిపిస్తాయి. పూత దశలో అశిస్తే పూత ఎండి రాలిపోతుంది. నివారణకు పూత దశలో 5 శాతం వేప గింజల కషాయం పిచికారీ చేయా లి. కాత మొదలైన తర్వాత కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీతో పాటు డెక్లోర్‌వాస్ 1.0, లేదా ప్రొపినోపాస్ 2.0 తో పాటు డైక్లోర్ వాస్ 1.0 మి.లీ తగు మోతాదు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

శనగ పచ్చ పురుగు ..


గుడ్డు నుంచి వెలువడిన లార్వాలు మొగ్గల్ని , పిందెలను, గోకి తింటాయి. పురుగు తిన్న కాయలు గుండ్రటి రంధ్రాలు ఏర్పడుతాయి. ఈ పురుగు వల్ల తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎల్‌ఆర్‌జీ -41 సాగు చేస్తే మంచిది. చేను పెరుగుతుండగానే వీలైనన్ని లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. అక్కడక్కడ బంతి మొక్కలను నాటాలి. ఎకరాకు 200 లార్వాలకు సమానమైన ఎన్‌పివి ద్రావణాన్ని లేదా బ్యాసిల్లస్ తురింజెన్సిస్ 400గ్రా, 200 లీటర్ల నీటితో కలిపి ఉదయం లేదా సాయంత్రం పిచికారీ చేయాలి.
రెండు సాళ్ల మధ్య గోనె సంచి లేదా టార్పలిన్‌ను పరి చి మొక్కలను దులిపి కింద పడిన లార్వాలను ఏరి నాశనం చేయాలి. గొడ్డుమోతు తెగులు సోకితే ఆకు లు చిన్నవిగా మారి లేత ఆకుపచ్చ రంగులో కనబడుతుంది. మొక్క పూత పూయదు, ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగుళ్లు కనిపిస్తే స్థాయిని బట్టీ 5మి.లీ డైకోఫాల్ లేదా 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడిని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈక రెక్కల పురుగులు కంది పూతను, మొగ్గలను కాయలను తొలిచి తిరుగుతుంది. నివారణకు ఎసిఫేట్ 1.5గ్రా, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్వినాల్‌ఫాస్ 2.0, మి.లీ లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి.
-మాసయ్య, వ్యవసాయ యూనివర్సిటీ,
9000377929

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు


ఇతర పంటల కన్నా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు. నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పాలెం పీఆర్‌జీ -41 రకం తెచ్చి, పావు ఎకరా సాగు చేశాను. అంతర పంటగా కంది రెండు వరసల తర్వాత నాలుగు వరసలు జొన్న సాగు చేశాం, జొన్న కోసిన అనంతరం కంది పూత దశకు చేరింది. అనంతరం మూడుసార్లు నీటి తడులు అందించాం. మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాళ్లుకు రూ. 5440 చొప్పున ధర వచ్చింది. కంది కోసిన అనంతరం మళ్లీ నీళ్ల తడి అందించా, రెండవసారి కూడా రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
-వీర స్వామి, రైతు చౌదర్‌పల్లి మహబూబ్‌నగర్

653
Tags

More News