వివిధ పంటల్లో.. మెళకువలు

Wed,August 8, 2018 11:11 PM

వివిధ పంటలను సాగు చేసే రైతులు ఆయా పంటలలో ఆశించిన దిగుబడులు సాధించాలంటే పంటల సాగులో యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఏ పంటలలో ఏ విధమైన పద్ధతులను పాటించాలనేది గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి వివరించారు. ప్రస్తుతం వివిధ పంటలలో పాటించవలసిన మెళుకువల గురించి ఆయన తెలిపిన వివరాలు..
various-crops

వరి

-నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని మురగ దమ్ము చేయాలి.
-పొలంలో సమానంగా చదును చేసి నాట్లు వేయాలి
-రేగడి భూముల్లో నాట్లు వేయడానికి రెండు రోజుల ముందే దమ్ము చేసి ఆ తర్వాత నాట్లు వేస్తే మంచిది.
-నాట్లు వేసే ముందు నారుకోనలు తుంచి వేస్తే కాండం తొలుచు పురుగు, ఆకు ముడత పురుగులు పెట్టిన గుడ్లు నాశనం అయి ప్రధాన పంటల్లో పురుగు ఉధృతి తగ్గుతుంది. క్లోరోపైరిఫాస్ ద్రావణంలో నారు వేర్లు ముంచి నాటితే ఎకరం నారుమడికి 200 మి.లిలు మొదటి దశలో వచ్చే పురుగులను నియంత్రివచ్చును.
-నాట్లు పైపైన చక్కగా చ.మీ కు 33 కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి. నారు ముదిరితే కుదుళ్ళ సంఖ్యలో పెంచాలి
-సిఫారసు చేసిన మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను విభజించి వేయాలి
-సిఫారసు చేసిన కలుపు మందులను వాడి కలుపును నివారించాలి
-పొలం గట్లు శుభ్రంగా ఉంచుకోవాలి


Green-Chilli

మిరప

-నారుమడిలో మాగుడు తెగులు రాకుండా ైబ్లెటాక్స్ మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి
-నారుమడిలో గుళికలు (కార్బోప్యూరాన్ 3జీ) వేసినైట్లెతే నాటిన 40 రోజుల వరకు పంటకు పురుగుల నుంచి రక్షణ కలుగుతుంది.
-భూసార పరీక్షలకు అనుగుణంగా సిఫారసు చేసిన మోతాదులలో ఎరువులు వేయాలి. నత్రజని ఎరువులు అధికంగా వేయవద్దు.
-సిఫారసు చేసిన దూరంలో నేలలను అనుసరించి మొక్కలు నాటాలి.


arachis_hypogaea

వేరుశనగ

-లింగాకర్షన బుట్టలు ఎకరాకు 8 చొప్పున పెట్టి చీడపీడలపై నిఘా పెట్టాలి.
-పొలం చుట్టూ కందకం తవ్వి పాలిడాల్ పొడితో లద్దె పురుగుల వలసను అరికట్టాలి.
-వృక్ష సంబంధమైన వేపనూనె, వేపకషాయం పిచికారీ చేసి పురగులను నియంత్రించాలి. పక్షి స్థావరాలు ఏర్పాటు చేసి పురుగులను నియంత్రించాలి.

red-gram-pasuthai

కంది

-అంతర కృషి గుంటకతో కానీ దంతెతో గానీ ఒకటికి రెండు సార్లు చేసి కలుపు తీయాలి. సాళ్ళ మధ్య లోతు సాళ్ళు చేసి వర్షపు నీరు భూమిలోకి ఇంకేటట్లు చేసినచో వర్షాభావ పరిస్థితులలో పంటలను కొంత వరకు కాపాడుకోవచ్చు.
-నట్టె కోటేశ్వర్‌రావు
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా,
9989944944

638
Tags

More News