స్థానిక వాతావరణ స్టేషన్‌తో సేద్యానికి కొత్త ఒరవడి

Thu,August 2, 2018 12:04 AM

-భూ సాంద్రత, విత్తన సాగులో తోడ్పాటు
-ఫలప్రదమైన సాఫ్ట్‌వేర్ నిపుణుల ప్రయోగం

ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సేద్యం చేస్తున్న రైతుల కోసం సరికొత్త ప్రయోగం చేపట్టారు. ఆ యువ ఇంజినీర్లు ఏడాది నుంచి కసరత్తు చేసి స్థానిక వాతావరణ స్టేషన్ ఏర్పాటు చేశారు. బిగ్‌విగ్ సాంకేతిక సహకారంతో మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వారు రూపొందించిన లోకల్ వెదర్ స్టేషన్ పనితీరును 6 నెలలుగా వ్యవసాయ క్షేత్రంలో పరిశీలన జరిపారు. చిన్న రైతులకు సైతం లోకల్ వెదర్ స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలన్న వారి ప్రయత్నం ఫలించబోతున్నది.
Electronic
జనగాంకు చెందిన సముద్రాల సంతోష్ ఉస్మానియా యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. అలాగే యాదగిరి గుట్ట జిల్లా సాద్‌వెళ్లికి చెందిన కటకం అమరేందర్ బీటెక్ చది వి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా ఐదేండ్లు పని చేశారు. అయితే వీరిద్దరూ చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. రైతు కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు యువ ఇంజినీర్లు స్థానిక సేద్యం సాగుబడుల మార్పులు.. చేర్పులపై దృష్టి నిలిపారు. ప్రధానంగా వాతావరణ పరిస్థి తులకు అనుగుణంగా సాగుబడులు సాగించడం వల్ల రైతు లకు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని, అలా గే తక్కువ ఖర్చుతో సేద్యం సాగిస్తే రైతుకు మేలన్న ఆలోచన లతో ఇరువురు ఏకీభవించారు. ఇందుకోసం మామూలు రైతులకు కూడా లోకల్ వెదర్ స్టేషన్‌ను అందు బాటులోకి తేవడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుం దని ఆలోచిం చి ముందడుగు వేశారు.

బిగ్‌విగ్ టెక్నాలజీతో..

బిగ్‌విగ్ టెక్నాలజీ సహకారంతో సంతోష్, అమరేందర్‌లు లోకల్ వెదర్ స్టేషన్‌ను తయారుచేశారు. దాదాపు 2 కిలో మీటర్ల పరిధిలో కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించేలా ఈ స్టేషన్‌ను రూపొందించారు. ప్రస్తుతం విని యోగంలో ఉన్న శాటిలైట్ ద్వారా అందించే సమాచారం అంతటా ఒకే తరహాలో ఉంటుంది. అయితే, లోకల్ వెదర్ స్టేషన్ ద్వారా అనేక రకాల ప్రయోజనాలుండే విధంగా దాని పనితీరును అందుబాటులోకి తీసుకువచ్చారు. బిగ్‌విగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఈ స్టేషన్ ద్వారా సుజావ్ మోబైల్ యాప్‌ను రైతుల కోసం లింకప్ చేశారు. దీంతో వర్షపాతంతో పాటు భూసాంద్రత, సాగుకు అణువుగా ఉండే పంటల సూచనలు, తెగుళ్ల నివారణను నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించారు. పంట దిగుబడులు.. మార్కెట్ ధరల వివరాలు, సాగుబడులపై సందేహాలను సైతం శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకునేలా వీరు రూపొందించిన సుజావ్ యాప్ పని చేస్తుంది. దీని ద్వారా ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి లింక్ చేసుకున్న రైతులకు సమాచారం అందించేలా కొత్త టెక్నాలజీని ఏర్పాటు చేశారు.

వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగం..

మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం దేపల్లె గ్రామంలోని కిసాన్ మైత్రి వ్యవసాయ క్షేత్రంలో లోకల్ వెదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి ప్రయోగం చేశారు. దాదాపు 6 నెలల నుంచి దీని పనితీరును పరిశీలించి రైతులకు వాతావరణ పరిస్థితులపై కొత్త మెళకువలను అందించేం దుకు యువ ఇంజినీర్లు సిద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు కేవలం వ్యవసాయం కోసం ప్రత్యేకంగా వెదర్ స్టేషన్లు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అతి వృష్టి.. అనావృష్టిలతో ఎప్పటిక ప్పుడు వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం వల్ల రైతు లు నష్టపోకుండా అప్రమత్తం అయ్యేందుకు ఈ స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. సేద్యం పనులు, రైతులను దృష్టిలో ఉంచుకుని వీరు రూపొందించిన కొత్త పరికరం చిన్నకారు రైతులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయల్ దేశంలో మాత్రమే ఈ తరహాలో వ్యవసాయానికి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా వెదర్ స్టేషన్ల ఏర్పాటుతో సేద్యం కొనసాగుతున్నది. రూ.15 వేల లోపు ఖర్చుతో సాధారణ రైతులకు ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకునేలా యువ ఇంజినీర్లు దీన్ని తయారు చేశారు.
- వంగూరు నర్సింహారెడ్డి, 9182777677
Electronic1

ఖర్చు తగ్గించడం కోసమే

రైతులకు ఖర్చు తగ్గించే సేద్యం కోసమే లోకల్ వెదర్ స్టేషన్‌ను తయారు చేశాం. సుజావ్ యాప్ ద్వారా అనేక రకాల సమస్యలను ఎప్పటికప్పుడు రైతులు తెలుసుకునే వెసులుబాటున్నది. మేం తయారు చేస్తున్న లోకల్ వెదర్ స్టేషన్‌ను గ్రామాల్లో రైతులకు అందించేందు కోసం ఫీల్డ్ ఏజెన్సీల ద్వారా ప్రయత్నిస్తాం. రెండేళ్ల కిందట వచ్చిన మా ఆలోచనను నేడు అమలు చేయబోతున్నాం. ప్రతి రైతు ఆలోచించి సేద్యం చేయాలి.. లాభాలు వచ్చే పంటలను పండించాలి. అందుకనుగుణంగా వాతావరణ పరిస్థితులపై అవగాహన పెంచుకుని ముందుకు సాగాలి. ఇంకాను కలుపు తీసే యంత్రాలు, పత్తిని తీసే రోబోలను సిద్ధం చేసే పనిలో ఉన్నాం.
- సంతోష్, జనగాం, 9959202004

చిన్న రైతులు చైతన్యం కావాలి

చిన్న రైతులు సేద్యం చేయక తప్పదు. అందుకే సేద్యంలో వస్తున్న సమస్యలపై చైతన్యం కావాలి. అలాంటి రైతుల కోసమే తాము లోకల్ వెదర్ స్టేషన్‌ను అందుబాటులో కి తెస్తున్నాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే టెక్నాలజీ ఆధారంగా సమాచారం సేకరించి స్థానిక వాతావరణ పరికరాన్ని సిద్ధం చేశాం. మేం తయారు చేసేందుకు రూ.25 వేల దాకా ఖర్చయింది. అయితే రైతులకు మరింత తక్కువ ఖర్చుతో అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. సోలార్ ఆధారంగా పని చేసే ఈ యంత్రం వాతావరణ అంశాల ద్వారా ప్రతి రైతు సేద్యం పనులను చేస్తే చాలా వరకు నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంది.
- అమరేందర్, సాద్‌వెళ్లి, 9849334539

1097
Tags

More News