యంత్రాలతో వరినాట్లు సులువు

Thu,July 26, 2018 12:13 AM

రాష్ట్రంలో వర్షకాలం, యాసంగి కాలాల్లో రైతాంగం వరిపంట సాగు చేస్తున్నారు. అయితే రైతు కూలీల సమస్య, అధిక ఖర్చుతో వరినాట్లు వేయాల్సి వస్తున్నది. ఈ కారణంగా యాంత్రీకరణ పరంగా అడుగులు వేసేలా రైతులకు రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు వరినాట్లు యంత్రంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పొలాల్లో క్షేత్ర ప్రదర్శనలు చేస్తున్నారు. దీంతో రైతులు యంత్రాలతో వరినాటు వేసేందుకు ముందుకు వస్తున్నారు.
paddy-machine

ఎకరానికి 80ఖానాల నారు అవసరం..

ఒక్క ఎకరాక సుమారు 80 ఖానాల నారు అవసరం. అంటే ఎకరాకు 10 నుంచి (సన్న గింజ రకం) 13 కేజీలు (దొడ్డు గింజ రకం) సరిపోతుంది. ముక్కు పగిలిన విత్తనాలను ఆరబోసి నిర్ణీత మోతాదులో 120 గ్రాములు(సన్న గింజ రకం) 160 గ్రాములు(దొడ్డు గింజ రకం) ఖానాల్లో పలుచగా చల్లి, పొడి చేసిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టును పైన చల్లాలి. దానిపై ఎండు గడ్డ(గోనె సంచిని) కప్పాలి. అంతేగాక మొలక రాగానే తీసివేయాలి. మరుసటి రోజు నుంచి మొలక చిన్నగా పెరిగే వరకు నీళ్లు చల్లి తరువాత కాలువల్లో నీళ్లు నింపుతూ అవసరం మేరకు నీళ్లు అందించాలి. 3 ఆకుల దశ వచ్చి సుమారు 15-20 సెంటీ మీటర్ల పొడవు పెరిగిన 15-17 రోజుల వయస్సుగల నారు నాటడానికి అనుకూలం. నారుకు అవసరం మేరకు నీటిలో కరిగే 19:19:19 లేదా 13:0:45 10 గ్రా/లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి.

చేపట్టాల్సిన రక్షణ చర్యలు

నారును ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరం మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పద్ధతిలో రైతు స్థాయిలో తక్కువ స్థలంలో, తక్కువ విత్తనంతో నారు పెంచుకొని నాటుకోవచ్చు. ముఖ్యంగా ఈ యంత్రంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నాటుకోవచ్చు. ఈ పద్ధతిలో ముఖ్యంగా వరినాటే ముందు ప్రధాన పొలాన్ని రొటోవేటర్‌తో దమ్ము చేసుకోవాలి. అలాగే నాటే ముందు వరినారును గట్ల మీద సిద్ధంగా ఉంచాలి. గంట నుంచి గంటన్నర వ్యవధిలో ఒక ఎకరం ఈ యంత్రంతో వేసుకోవచ్చు. యంత్రాన్ని బట్టి 3 నుంచి 3.5 లీటర్ల డీజిల్ లేదా నాలుగు లీటర్ల పెట్రోలు అవసరం అవుతుంది. ముఖ్యంగా దీనివల్ల వేసిన ఎరువులు సులభంగా మొక్కకు అందుతాయి. కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. నీటిని పొదుపుగా వాడుకోవచ్చు. కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వరినాటు యంత్రాలు వాకింగ్ టైపు (వెనుక నడుస్తూ వేసే యంత్రాలు) రైడింగ్ టైపు (కూర్చొని నడుపుతూ నాటు వేసే యంత్రాలు) ముఖ్యంగా ఈ పద్ధతిలో వరి నాటుకోవడం వల్ల తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వరినాటు యంత్రాలు రైతు మిత్ర గ్రూపులకు రాయితీ మీద ఇస్తారు. కాబట్టి ముందుగానే రైతులు అవగాహన కుదుర్చుకొని చేసుకోవచ్చును.
-గుండెల రాజు
మహబూబాబాద్ 72889 85757

సద్వినియోగం చేసుకోవాలి

యాంత్రీకరణతో వరినాటు వేసుకోవడం వల్ల కూలీల సమస్య ఉండదు. అంతేగాక తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నాటుకోవచ్చు. ఖర్చు కూడా తక్కువ. వరినాటే యంత్రాలు ప్రభుత్వం రాయితీపై రైతు మిత్ర గ్రూపులకు అందజేస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాటే పొలం తయారీ, సమగ్ర పోషకాహార, సాగునీటి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పకుండా పాటించాలి.
-బి. క్రాంతికుమార్
శాస్త్రవేత్త, కేవీకే రుద్రూర్,
నిజామాబాద్
73374 11871

kranti-kumar

208
Tags

More News