ఉద్యోగం వద్దనుకున్నాడు సేద్యమే బాగు అంటున్నాడు

Thu,July 19, 2018 01:19 AM

Agriculture.jpg
అతడికి వ్యవసాయం అంటే విపరీతమైన మక్కువ. ఎంతలా అంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనా వెళ్లకుండా.. సాగు వైపు కదిలాడు. కూరగాయలు అధికంగా పండించే ప్రాంతంలో ఓ భూస్వామి వద్ద భూమిని కౌలుకు తీసుకొని సాగును ప్రారంభించాడు. సరికొత్త పద్ధతులతో వ్యవసాయం చేస్తూ సొంతంగా మార్కెటింగ్ చేసుకున్నాడు. దీంతో లక్షల్లో లాభాలు పొందడమే కాదు.. తాను కౌలు తీసుకున్న భూమినే కొనుగోలు చేసి రైతుగా మారాడు.

అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన హనీఫ్ ఇంటర్‌మీడియెట్ చదువుకుని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయినా ఏదో అసంతృప్తి. ఈ సందర్భంలోనే గుమ్మడిదల మండలం కూరగాయల పంటలకు ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే గుమ్మడి దల మండలం మంబాపూర్ గ్రామ శివారులో ఓ భూసామి వద్ద కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. స్థానిక రైతుల సూచనలు తీసుకొని ఆరంభంలోనే టమాటా సాగు చేసి మంచి లాభాలు సాధించాడు. ఈ క్రమంలో ఉద్యానవనశాఖ అధికారుల చొరవ తో రాయితీపై పందిరి సాగు, బిందు సేద్యం పరికరాలకు పొందా డు. అధికారుల సలహాలతో పందిరి, డ్రిప్ పద్ధతిలో టమాటా, బెండ, దొండ, బీర వంటి తీగ జాతి పంటలను సాగు చేశాడు. అంతేకాదు కూకట్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకొని.. తాను పండించిన పంటలను తానే మార్కెటింగ్ చేసుకున్నాడు. ఇలా నాలుగేండ్లలోనే కౌలుకు తీసు కున్న భూమిలో ఆరు ఎకరాలను కొనుగోలు చేశాడు. ఇందులో ఆధునిక పద్ధతుల్లో పంటను సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నానని రైతు హనీఫ్ చెబుతున్నాడు. తాను సాగు చేస్తు న్న కూరగాయ పంటలను నిత్యం ఉద్యానవన శాఖ అధికారుల తో చుట్టుపక్కల రైతులు సందర్శిస్తుంటారని పేర్కొంటున్నాడు.

అత్యాధునిక పద్ధతుల్లో టమాటా సాగు...

రైతు హనీఫ్ ప్రస్తుతం తనకున్న అరు ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. మల్చింగ్, పందిరి, షేడ్‌నెట్, బిందుసేద్యం పద్ధతిని పాటించాడు. ప్రస్తుతం పంట చేతికి వచ్చింది. మార్కెట్లో కిలో రూ. 30 నుంచి రూ. 40 పలుకుతున్నది.
motora.jpg

మల్చింగ్+పందిరి సాగు..

మొదట పొలాన్ని లోతుగా దున్నుకొని.. సాళ్లుగా చేసుకోవాలి. ఇందులో మోతాదులో డీఏపీ, సల్ఫర్, ఎకరాకు నాలుగు ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసుకోవాలి. దీంతో పాటు బయోఆర్గానిక్స్ ఎరువులను వేసుకోవాలి. అనంతరం బోదెలు చేసుకొని డ్రిప్ పైపులు ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై మల్చింగ్ పేపరును పరిచి.. రంధ్రా లు చేసి టమాటా నారును నాటుకోవాలి. టమాటా నారు పెద్దగా అవుతున్న సమయంలో స్టేకింగ్ పద్ధతి (తాళ్లతో కట్టడం) మొక్కలను తాడుతో పందిరిపైకి కట్టుకోవాలి. డ్రిప్ ద్వారానే మొక్కలకు మందులను, ఎరువులను అందిస్తుండాలి. పూతదశలో కాస్త జాగ్ర త్తలు పాటిస్తే మంచి దిగుబడి వస్తుంది. వర్షాకాలంలో ఎకరానికి 25- 30 టన్నులు, చలికాలంలో అయితే 50- 60 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పద్ధతి వల్ల తేమ నిల్వ ఉండి మొక్క ఆరోగ్యంగా పెరుగడమే కాదు.. కలుపు నివారించబడుతుంది. నీరు, ఎరువులు కూడా వృథా కావు.

కూలీలకు ఉపాధి

రైతు హనీఫ్ తన కూరగాయల తోటల్లో 20 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. మంచి వాతావరణంలో కూలీ పనులను చేసుకుంటున్నామని కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

-ఎం. యాదగిరి, గుమ్మడిదల, 9553276238

ఇష్టంగా చేస్తే లాభాలే

వ్యవసాయాన్ని ఇష్టంగా చేస్తే మంచి లాభాలను సాధించవచ్చు. వాతావర ణానికి అనుకూలంగా పంటలను సాగు చేసుకోవాలి. ప్రధానంగా మార్కెట్ ధరలకు అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలి. ఉద్యానవనశాఖ అధికా రుల సూచనలతో రాయితీలపై పందిరి, డ్రిప్ పరికరాలను తీసుకున్నాను. చుట్టు పక్కల ఎవరూ సాగు చేయని తీగ జాతి పంటలైన బీర, దొండతో పాటు టమా టా వంటివి సాగు చేస్తున్నాను. పంట మార్పిడి తప్పనిసరిగా పాటిస్తాను. ఇప్పుడు మల్చింగ్ పద్ధతితో పందిరి, షేడ్‌నెట్ ద్వారా టమాటా సాగు చేశాను. ఉద్యానవన శాఖ అధికారులు పంటల ను పరిశీలించి ప్రశంసిస్తుంటారు. ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు మా పంటలను సందర్శిస్తుంటారు.

-హనీఫ్, రైతు, మంబాపూర్ 9441178058

747
Tags

More News