వానకాలం నారుమడుల్లో యాజమాన్య పద్ధతులు

Thu,July 19, 2018 01:13 AM

PADI.jpg
వానకాలం వరి నాడుమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త దేవ అనిల్ యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. వరి సాగులో నారుమ డి పెంపకం దశ అత్యంత కీలకమైంది. సుమారు నెల రోజులపాటు సాగే ఈ ప్రక్రియలో రైతుల ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. తెగుళ్లను ఎప్పటికప్పుడు నివారిస్తూ సరైన పద్ధతులు పాటిస్తే ఆరోగ్యవంతమైన నారును, తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు వారిని 9949874968 ద్వారా సంప్రదించవచ్చు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు దీర్ఘకాలిక రకాలకు (150రోజులపైన) బదులుగా, మధ్య లేదా స్వల్పకాలిక రకాలు (110-130 రోజులు) అయిన కూనారం సన్నాలు(కేఎన్‌ఎం 118), బతుక మ్మ(జేజీఎల్ 18047), ఎంటీయూ 1010(కాటన్‌దొర సన్నాలు), తెలంగాణ సోన(ఆర్‌ఎన్‌ఆర్ 15048), అంజన(జేజీఎల్ 11118) వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. ఈ స్వల్పకాలిక రకాలను ఈ నెల చివరి వారం వరకు నారుపోసుకోవచ్చు.

నారుమడి తయారు

ఎకరం వరి సాగు చేయడానికి 2 గుంటలు లేదా 5 సెంట్ల నారుమడి సరిపోతుంది. మొదట నారుమడిని వారంరోజుల వ్యవధిలో రెండుసా ర్లు బాగా దున్ని కలుపు లేకుండా చేయాలి. తర్వాత నారుమడిలో 15 రోజుల పాటు నీరు నిల్వ ఉంచాలి. దీనివల్ల పాత విత్తనాలు, గడ్డి, కలు పు విత్తనాలు మురిగిపోతాయి. నీరు నిల్వ ఉంచిన సమయంలో 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు బాగా దమ్ము చేసి చివరి దమ్ము తర్వాత చదును చేయాలి. దీర్ఘచతురస్రాకారంలో ఉండేటట్లు 8-10మీటర్ల పొడ వు, 1-3 మీటర్ల వెడల్పు 15సెం.మీ ఎత్తు ఉండేలా నారుమడులను తయారు చేసుకోవాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి.

విత్తన మోతాదు.(ఎకరానికి)

సన్నరకాలైతే 20 కిలోలు, దొడ్డు రకాలైతే 25కిలోలు.

నిద్రావస్థ

లీటరు నీటికి 6.3మి.లీ గాఢ నత్రికామ్లం కలిపిన ద్రావణంలో కిలో విత్తనాలు 24గంటలు నానబెట్టాలి. తర్వాత విత్తనాలను మరో 24 గంటలపాటు మండెకట్టి మొలక వచ్చిన విత్తనాలను నారుమడిలో చల్లుకోవాలి.

విత్తనశుద్ధి

నారుమడిలో విత్తనాలు ఒత్తుగా చల్లితే మొక్కలు బలహీనంగా ఉంటా యి. పలుచగా చల్లితే దుబ్బుకట్టి పీకే టప్పుడు వేర్లు తెగిపోతాయి. అందువల్ల విత్తనాన్ని నారుమడిలో సమతూకంగా చల్లుకోవాలి. దుంపనారు మడులు పైరును శిలీంధ్రాలు ఆశించకుండా విత్తనాన్ని విత్తేముందు 1కిలో విత్తనానికి 1కిలో కార్బండిజమ్ మందును 1లీటరు నీటిలో కలిపి విత్తనాలను 24గంటలు నానబెట్టి మరో 48గంటలు మండెకటి ్టదుంప నారుమడిలో చల్లుకోవాలి

ఎరువుల యాజమాన్యం

200కిలోలు బాగా చివికిన పవువుల ఎరువు , 2కిలోల నత్రజని, 44కిలోల యూరియా, 1కిలో భాస్వరం, (6.25కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్), 1కిలో పొటాష్, (1. 67కిలో మ్యూరెట్ ఆఫ్ పొటాష్) 1కిలో జింక్ సల్ఫేట్ అవసరం.

కలుపు యాజమాన్యం

వరినారుమడుల్లో ఊద ఎక్కువగా కనిపిస్తుంది. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు వరి మొక్కకు, ఊద మొక్కకు తేడా కనుక్కోవడం కష్టం. దీని నిర్మూలనకు నారు మొక్కలు మొలవక ముందే విత్తిన 2వలేదా, 3వ రోజున లీటరు నీటకి 2మి.లీ ప్రెటిలాక్లోర్ 50శాతం పిచికారీ చేయాలి. విత్తిన 10-15రోజులకు ఊద వంట గడ్డిజాతి కలుపు మొక్క లు ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2మిల్లీ లీటర్ల సైహలోఫాస్ బ్యూటైల్10శాతం కలిపి పిచికారీ చేయాలి.

నీటి యాజమాన్యం-సస్యరక్షణ పద్ధతులు

నారు ఒకటి రెండు ఆకుల దశకు వచ్చే వరకు ఆరుతడులు ఇస్తూ, 10 రోజుల తర్వాత నారుమడిలో పలుచగా నీరు ఉంచాలి. నారుమడి ఎప్పుడు తడిగా ఉంచాలి. నారు పీకే వరకు మడిలో నీరు నిల్వ ఉండేలా చూడాలి. నారు పీకే సమయంలో మాత్రం 3-4 సెం.మీ మేర నీరు నిల్వ ఉంచితే నారు తేలికగా వస్తుంది. నారుమడిలో అగ్గి తెగులు నివారించేందుకు లీటరు నీటికి 0.6గ్రాముల ట్రైసైక్లజోల్ 75 డబ్ల్యుపి మందును కలిపి పిచికారీ చేయాలి. నారు పీకేందుకు వారం రోజుల ముందు 5సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు వేసుకుంటే మొగి పురుగు, ఉల్లి కోడును అరికట్టవచ్చు. నారు 4 నుంచి 6 ఆకుల దశకు వచ్చినపుడు అంటే సుమారుగా 21రోజుల నుంచి 25 రోజుల మధ్య నారును వేరు వ్యవస్థ దెబ్బతినకుండా పీకి ప్రధాన పొలంలో నాటుకోవచ్చు.

-సిద్ధం సదానందం, కాల్వశ్రీరాంపూర్ మండలం
9949889750

170
Tags

More News