అరటి సాగు లాభదాయకం

Wed,July 11, 2018 11:25 PM

-ఏ సీజన్‌లోనైనా సాగు చేయవచ్చు
-బహుళ ప్రయోజనాలు
-లాభమే తప్ప నష్టం ఉండదు
ఏ సీజన్‌లోనైనా అరటికాయలకు మంచి గిరాకీ ఉంటుంది. పైగా ఈ పంటను ఏ సీజన్‌లోనైనా సాగు చేసుకోవచ్చు. అరటిలో కేవలం పండే కాకుండా ఆకులు, పిలుకలకు మంచి డిమాండ్ ఉంటుంది. లాభాలు తప్ప దాదాపు నష్టాలు ఉండవు. కాబట్టి రైతులు అరటి సాగులో కాస్త జాగ్రత్తలు పాటిస్తే లాభాలు గడించవచ్చునని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
TRIPURARAM

ఎరువుల వాడకం

టిష్యూకల్చర్ రకం అరటి మొక్కలకు పోషక పదార్థాలు నిల్వ ఉండే దుంపలుండవు. ఇవి నాటిన వెంటనే తొందరగా పెరుగుతూ ఎరువుల ను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. నాటిన 4-5 నెలలకు గెల అంకురం ఏర్పడి హస్తాలు, కాయల సంఖ్య నిర్ణయమవుతుంది. ఈ దశలో అరటిచెట్టు పెరుగుదల్లో చాలా కీలకం. కాబట్టి పోషకాల లోపం లేకుండా సిఫార్సు మేర కు ఎరువులు అందించాలి. లేకుంటే గెలలో హస్తాల, కాయల సంఖ్య తగ్గుతుంది. ఆ తర్వాత వేసే ఎరువులు చెట్లు, కాయలవృద్ధికి ఉపయోగపడుతాయే తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండ దు. ఎరువులను గుంతల్లో వేయాలి. దీంతో పాటు మొక్కలు నాటిన రెండోవారం నుంచి డ్రిప్ ద్వారా నీటిని అందించాలి. టిష్యూకల్చర్ రకం అరటిచెట్లకు ఎరువులను డ్రిప్ ద్వారా వేస్తే అధిక ఖర్చు అవుతుంది. ఎరువులను రోజూ, 2-3 రోజులకు గాని, వారానికోసారి గాని అందించవచ్చు. పోషకాల వినియోగంలో టిష్యూకల్చర్ రకం అరటి అగ్రగామి. ఒక టన్ను అరటికాయల దిగుబడికి 8 కిలోల నత్రజని, 1.5 కిలోల భాస్వ రం, 20 కిలోల పొటాష్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ లెక్కన ఎకరాకు 30 టన్నుల దిగుబడికి 240 కిలోల నత్రజని, 45 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాష్ వేయాలి.

పిలుకలు తీయడం

సాధారణంగా అరటిచెట్టు 3 - 8 పిలకలు వేస్తుం ది. అవసరానికి మించి నత్రజని వేసినప్పుడు, తల్లి చెట్టుకు దెబ్బ తగిలినప్పుడు, అవసరానికి మించి మట్టి ఎగదోసినప్పుడు పిలుకలు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు తీసివేయా లి. లేకుంటే భూమిలోని పోషకాలను తల్లిచెట్టుతో సమానంగా పిలకలు ఉపయోగించుకొని పోటీపడి పెరిగి తెగుళ్లు, పురుగుల బెడదను పెంచుతాయి. పిలకలను ఆకుల కింద భాగంలో కొడవలితో కోసి, మధ్యభాగాన్ని పొడిచి వెంటనే 10 - 20 చుక్కల కిరోసిన్‌ను ఇంక్ ఫిల్లర్‌తో లేదా సిరంజితో వేస్తే మళ్లీ రావు

సాగు విధానం...

-అరటిని ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. అరటి ఉష్ణమండల పంట. 10 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగత్ర వరకు ఉంటే మంచి దిగుబడి పొందవచ్చు.
-ఉష్ణోగత్ర తక్కువగా ఉంటే గెలల్లో ఎదుగుదల తగ్గిపోతుంది. అరటిని ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. కానీ ఆయా ప్రాంతాల్లో మార్కెట్‌ను అనుసరించి పంట వేయాల్సిన మాసా న్ని ఎంచుకోవాలి.
-అరటిలో గ్రాండ్‌నైన్ రకం అరటి అధిక దిగుబడి ఇస్తుంది.
-నీరు ఇంకే సారవంతమైన నేలలు సాగుకు అనుకూలం.
-చౌడు భూములు పనికిరావు.
-భూమిని బాగా దుక్కిచేసి, చదును చేసిన తరువాత అరడుగుల పొడువు, ఐదడుగుల వెడల్పుతో లేదా ఐదున్నర అడుగు పొడవు, వెడల్పుతో పిలుకలు నాటుకోవాలి.
-1.5 అడుగుల గుంతలు తవ్వాలి. గుంత పై భాగం మట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 300 గ్రాముల ఆము దం లేదా వేపపిండి, 150 గ్రాముల సూపర్‌ఫాస్ఫేట్ కలిపి గుంతలు పూడ్చాలి.
-నీరు పెడితే గుంతలో మట్టి సర్దు కుంటుంది. టిష్యూకల్చర్ రకం మొక్కలను మట్టి, గడ్డి చెదరకుండా పాలిథిన్ సంచుల నుంచి తీసి, గుంత మధ్యలో పెట్టి తిరిగి డ్రిప్ ద్వారా నీరు పెట్టాలి.

TRIPURARAM2

దిగుబడులు ఇలా

ఎంగాంబి కేఎం-5 పండు రకానికి చెందిన అరటి దీని పంటకాలం 11 నుంచి 12 నెలలు ఉంటుంది. గెలకు 9 నుంచి 11 హస్తాల(140 నుంచి 160 పండ్లు)తో 18 నుంచి 20 కేజీల బరువు వస్తాయి. ఈ రకం కర్పూర అరటిని పోలి ఉంటుంది. ఫైయా-3 అనేది హైబ్రిడ్ రకం. ఇది కూరకు మాత్రమే పనికివస్తుంది. పంటకాలం 13 నుంచి 14 నెలలు ఉంటుంది. ఎకరాకు 20 టన్నుల దిగుబడి వస్తుంది.
-నగిరి హరీష్, త్రిపురారం

881
Tags

More News