విత్తన ఎంపికే కీలకం

Wed,June 13, 2018 10:42 PM

seeds
వానకాలం సీజన్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధం అయ్యారు. అయితే రైతులు ఆశించిన దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి. విత్తనాల ఎంపికతో పాటు ఎరువుల వాడకంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే బోగస్ కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు, పురుగుమందులు అంటగట్టేందుకు ప్రయత్నిస్తాయి.ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఆకర్షిత ప్రకటనలకు లోను అయితే అనేక ఇబ్బందులను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. తొందరపడితే పంటకాలం మొత్తం ఇబ్బందులకు గురికావద్దు. వ్యవసాయశాఖ గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలి. గుర్తింపు పొందిన డీలర్ల దగ్గర విత్తనాలు కొనుగోలు చేసినా తప్పకుండా బిల్లులు తీసుకోవాలి. బిల్లుపై విక్రయదారుడి పేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకాల నెంబర్, నికర తూకం నెంబర్‌ను సరి చూసుకోవాలి. విత్తన రకం పేరు, బ్యాచ్ నెంబర్ గడువు తేదీ, కంపెనీ పేరును తప్పని సరిగా నమోదు చేయించుకోవాలి. తీసుకున్న బిల్లును పంటకాలం పూర్తి అయ్యేవరకు బిల్లును జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. పంట మొలకెత్తే, ఎదుగుదల సమయంలో ఏమైన లోపాలు ఉన్నైట్లెతే తక్షణం స్థానిక వ్యవసాయశాఖ అధికారిని సంప్రదించాలి.

సాగులో రసాయన ఎరువుల వాడకం తప్పనిసరైతే మోతాదుకు మించి రసాయనఎరువులు వాడకూడదు. దీనివల్ల భూసారం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇటు పెట్టుబడి భారం పెరిగిపోతుంది. పంటలో చీడపీడల బెడద ఎక్కువగా ఉంటే వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకే రసాయిక మందులను వాడాలి.
-మద్దెల లక్ష్మయ్య,
ఖమ్మం వ్యవసాయం, 9010723131

437
Tags

More News