విత్తనశుద్ధి చేసుకోవాలి ఇలా

Wed,June 6, 2018 10:41 PM

రైతులు మేలురకం విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. దీంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన దిగుబడులు పొందవచ్చు. పంటను తెగుళ్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే తక్కువ ఖర్చుతో పంటలకు రక్షణ కల్పించవచ్చు. అదేవిధంగా విత్తనశుద్ధి ద్వారా పంటను ఆశించే చీడపీడలను కూడా నివారించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వానకాలం సీజన్ ప్రారంభం కాబోతున్నది. కాబట్టి ప్రతి రైతు విత్తనశుద్ధిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ జె.హేమంతుకుమార్ రైతులకు సూచిస్తున్నారు. అయితే ఏ రకం విత్తనాలను ఎలా విత్తనశుద్ధి చేయాలో ఆయన కింది విధంగా సూచించారు.
paddy
విత్తనం నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, పురుగులను సమర్థవంతం గా నివారించడానికి దోహదపడుతుంది. శుద్ధికి వినియోగించే మం దులు విత్తనం భూమిలోకి చొచ్చుకొనిపోయి, శిలీంధ్ర రకాలను నాశనం చేయడం జరుగతుంది. పప్పుజాతికి సంభందించిన వాటి మొక్కల వేర్లపై బొడిపెల సంఖ్య పెంచేందుకు దోహదం చేస్తుంది.

విత్తనశుద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విత్తనశుద్ధిలో వాడే మందుల వాడకంలో అప్రమత్తత చాలా అవస రం. అవసరమైన మేరకే మందులను వాడాల్సి ఉంటుంది. మోతా దుకు మించి మందులను వాడినట్లయితే విత్తన మొలక శాతం తగ్గే అవకాశం ఉన్నది. విత్తన శిలీంధ్రానికి పురుగు మందులు వాడితే విత్తనశుద్ధి చేసిన తర్వాత జీవ రసాయనాలతో శుద్ధిచేయాలి. విత్త న శుద్ధి చేసేటప్పుడు గింజ పగులకుండా తోలుపై పొరపోకుండా చూసుకోవాలి. అవసరమైతే సమీప వ్యవసాయశాఖాధికారిని గాని, శాస్త్రవేత్తలను గాని సంప్రదించాలి.

మక్క, పెసర, కందిలో ఇలా...

వరి పంటతోపాటు అపరాల విత్తనాలకు సైతం విత్తనశుద్ధి చాలా ముఖ్యం. వానకాలం సీజన్‌లో మక్క, పెసర, కంది పంటల్లో సాగు చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిస రి. మక్క విత్తనాలకు సంబం ధించి కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్, కలి పి విత్తనశుద్ధి చేసుకోవాలి. పెసర పంటలో తొలి దశలోనే ఆశించే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల నివారణకు ముందస్తు జాగ్రత్తలే మేలు చేకూరుస్తాయి. ఒక కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును పట్టించాలి. అనంతరం 2.5 గ్రాము ల మాంకోజెబ్‌తో కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే 20-25 రోజుల పాటు పైరు ఏపుగా పెరుగడమే కాకుండా ఎటువంటి చీడపీడలు ఆశించవు. అదేవిధంగా కంది పంటకు ఎండు తెగులును తట్టుకోవడానికి కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడే కలిపి శుద్ధి చేసుకోవాలి.

వేరుశనగ, మిరపలో విత్తనశుద్ధి..

వేరుశనగ విత్తనశుద్ధికి గాను కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్, లేదా 1 గ్రాము ట్రైకోనజోల్‌ను కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. తద్వారా ఆకుమచ్చ, కాండం కుళ్లు, వంటి తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6 మిల్లీ లీటర్ల క్లోరోపైరిఫాస్‌తో కలిపి శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మిర్చి విత్తనాలకు సం బంధించి కిలో విత్తనాలకుగాను లీటర్ నీటిలో 150 గ్రాముల ట్రైసోడి యం ఆర్థోపాస్‌పేట్‌ను కలిపి 20 నిమిషాలు పాటు నానబెట్టాలి. అనంతరం రసం పీల్చే పురుగుల నివారణకుగాను కిలో విత్తనాలకు 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలుపాలి. తర్వాత 3 గ్రాముల మాంకోజెబ్ పట్టించి విత్తుకోవాలి. దీనివల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకోవచ్చని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచి స్తున్నారు.

-మద్దెల లక్ష్మణ్
ఖమ్మం వ్యవసాయం, 9010723131

వరిలో తడి, పొడి పద్ధతులు..

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో సాగయ్యే పంటల్లో వరి పంట ఒకటి. మనం నిత్యం తీసుకునే ఆహారం అయినందున వరి సాగుకు సంబంధించి విత్తనశుద్ధి చాలా ముఖ్యం. వరిలో తడి, పొడి పద్ధతుల్లో విత్తనశుద్ధి చేపట్టవచ్చు. పొడి పద్ధతి ద్వారా విత్తనశుద్ధి చేసే రైతులు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజంను కలిపి 24 గం టల తర్వాత మెట్ట నారుమడుల్లో విత్తుకోవాలి. తడి పద్ధతిలో శుద్ధి చేయదల్చిన రైతులు ఒక గ్రాము కార్బండిజంను లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటలు నానబెట్టిన తర్వాత 24 నుంచి 36 గంటల వరకు మండె కట్టుకోవా లి. అనంతరం నారుమడుల్లో చల్లుకోవాలి.

474
Tags

More News