లోతు దుక్కులతో లాభాలు

Wed,June 6, 2018 10:39 PM

నేలను 25 నుంచి 70 సెంటీ మీటర్ల లోతుగా దున్నుకుంటే తొలక రి వర్షాలకు పంటలు వేసుకునేందుకు అనువుగా ఉంటుంది. రైతు లు ట్రాక్టర్, ఎడ్లనాగలి ద్వారా దుక్కులు చేసుకోవాలి. కల్టివేటర్ దుక్కికి ఉపయోగపడదు. కల్టివేటర్ నేలను 5 నుంచి 10 సెంటీమీ టర్లకు మించి దున్నరాదు. మెట్ట భూములను చీసెల్ నాగలితో దున్న డం చాలా మంచిది.
agriculture-farmer
దీంతో వర్షం పడినప్పుడు నీరు భూమి పొరల్లోకి చేరి పైరు నీటి ఎద్దడికి గురికాకుండా ఉంటుంది. అలాగే వర్షం పడిన తర్వాత రెం డు, మూడు రోజుల తర్వాత సబ్‌సాయిలర్ వాడితే బాగుంటుంది. మాగాణి భూముల్లో రోటివేటర్‌కు బదులు మోల్ట్‌బోర్డు నాగలితో దున్నుకోవాలి. దీంతో నేల లోతుగా తిరుగబెట్టేలా దున్నుకోవచ్చు. పొలం ఎగుడుదిగుడుగా అలాగే గడ్డి పరక ఎక్కువగా ఉంటే డిస్క్ నాగలి వాడాలి. దీని ద్వారా కలుపు మొక్కలు వాటి బీజాలను నిర్మూలించవచ్చు.

ఎన్నో ప్రయోజనాలు...

-వేసవి దుక్కుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. నేల ఏటవాలుగా ఉండి కోతకు గురవుతుంటే వేసవి దుక్కి వాలుకు అడ్డంగా దున్నాలి. తద్వారా భూసారం కొట్టుకుపోకుండా ఉంటుంది. వర్ష పు నీరు భూమి పొరల్లోకి చేరి పైరు నీటి ఎద్దడికి గురికాకుండా ఉంటుంది.
-లోతు దుక్కుల్లో మొక్కలు త్వరగా అంటుకోవడంతో పాటు వేరు వ్యవస్థ బలపడి అధిక పోషకాలను గ్రహించగలుగుతాయి. నేల లోపలి పొరల్లో పంటలకు హానిచేసే క్రిములు, ఇతరత్రా చీడపీడల లార్వాలు భూ పై పొరల్లోకి రావడం వల్ల ఎండ వేడిమికి నశిస్తాయి.
-దుక్కుల ద్వారా మట్టి రేణువుల్లోకి గాలి వెళ్తుంది. ఆరోగ్యవంతమైన నేలకు సంబంధించి మట్టి రేణువుల్లో 50 శాతం నీరు 25 శాతం గాలి ఉండాలి. కలుపు మొక్కలను వేర్లతో సహా పెకిలించడం వల్ల చనిపోతాయి.
-నేలను తిరిగేయడం వల్ల చీడ పురుగులను పక్షులు ఏరుకొని తినే అవకాశం ఉంటుంది.
-సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నమై పోషకాలు విడుదలవుతాయి. దీంతో మొక్కలు బలంగా పెరు గుతాయి.
- ఎం.డి.వహీద్, చెన్నారావుపేట

వేసవి దుక్కులు చేసుకోవాలి

వేసవిలో అడపాదడపా కురిసే వర్షాలకు తప్పనిసరిగా వేసవి దుక్కులు తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా లార్వా దశలో ఉన్న పురుగులు బయటకు వచ్చి ఎండవేడిమికి చనిపోతాయి. దీంతో చీడపీడల ఉధృతి బాగా తగ్గిపోతుంది. వాలుకు అడ్డంగా పంటలు సాగుచేస్తే వర్షం పడినప్పుడు సారవంతమైన నేలపై పొర కొట్టుకుపోకుం డా ఉంటుంది.
- మడూరి హరిప్రసాద్ గౌడ్,
మండల వ్యవసాయాధికారి, చెన్నారావుపేట

454
Tags

More News