వంకాయ తోటలో యాజమాన్య చర్యలు

Wed,June 6, 2018 10:38 PM

తాజా కూరల్లో రాజా ఎవరంటే ఎవరైనా చెబుతారు వంకాయేనని. సాగుకు అనుకూలంగా ఉండే ఈ వంకాయ పంటను రైతులు అధికంగా పండిస్తారు. కాలం ఏదైనా రైతులు ఎల్లవేళలా ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ పంటను తెగుళ్లు, చీడపీడలు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఈ తోట సాగుచేసే రైతులు ఎప్పటికప్పుడు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
TIPURARAM
తెగుళ్లు, చీడపీడలను వెంటనే గుర్తించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తోటకు ఎలాంటి నష్టం వాటిల్లదు. తోటలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ల గురించి నిపుణులు వివరించారు.

సస్యరక్షణ చర్యలు మొవ్వు, కాయతొలిచే పురుగు

కాయ వంకర్లు తిరుగడం, కాయలకు రంధ్రాలు పడ టం వల్ల మార్కెట్లో ధర లభించక రైతులు నష్టపో యే అవకాశం ఉన్నది. ఈ పురుగు నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు మందును లీటర్ నీటి లో కలిపి పిచికారీ చేయాలి. నారు దశలో పురుగు ఆశిస్తే కొమ్మల చివర తుంచి వేయాలి. పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయా లి. లింగాకర్షక బుట్టలను ఎకరానికి నాలుగు చొప్పు న ఏర్పాటుచేయాలి. రైతులు తోటను ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ ఉండాలి.

రసం పీల్చే పురుగులు (తెల్లదోమ, పేనుబంక)

ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోతాయి. దీన్ని నివారించేందు కు పిప్రోనిల్ 2 మిల్లీ లీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒక వేళ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

నులి పురుగులు

నులి పురుగు ఆశించిన తోటల్లో వేర్లు బొడిపెలతో ఉంటాయి. మొక్క పీలగా మారుతుంది. దీని నివారణకు రైతులు అంతరపంటగా బంతిపూలను సాగు చేయాలి. పంట మార్పిడి ద్వారా నులి పురుగును నివారించవచ్చు.

ఆకుమాడు, కాయకుళ్లు తెగులు

గోధుమరంగు మచ్చలు ఆకులపై ఏర్పడి పసుపు రంగుగా మారి క్రమంగా ఆకు పూర్తిగా ఎండిపోయి రాలిపోతుంది. ఈ తెగులు చల్లని వాతావరణం ఉన్నప్పుడు పంటను ఎక్కువగా ఆశిస్తుంది. కాయ లు కూడా పసుపు రంగుకు మారి కుళ్లిపోతాయి. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు చొప్పున పిచికారీ చేయాలి.
- నగిరి హరీష్, త్రిపురారం

721
Tags

More News