ప్లగ్ ట్రేలలో నారు పెంచే విధానం

Wed,April 4, 2018 11:49 PM

రైతులు విత్తన మొలక శాతం పరీక్షించిన తర్వాతే నారుమడులు పెంచుకోవాలి. రైతుస్థాయిలో సులభంగా మొలక శాతం పరీక్షించుకోవచ్చు. ఫిల్టర్ పేపర్లు తీసుకుని పరీక్షించవలసిన పంట గింజలను పేపర్‌లో వరుసగా ఒకదాని పక్కన మరొకటి పెట్టి పేపర్‌ను చుట్టాలి. ఆ తర్వాత చీకట్లో ఉంచి, ఉదయం, సాయంత్రం పూట నీటితో తడి చేయాలి. వంకాయ, టమాటా విత్తనాలు 5 నుంచి 6 రోజుల్లో, మిరప అయితే 10-11 రోజుల్లో మొలకెత్తుతాయి. ఆ తర్వాత మొత్తం 100 విత్తనాలకు ఎన్ని మొలకెత్తితే అంత శాతంగా నిర్ధారించుకోవచ్చు.
Flanit

ప్లగ్ ట్రేలలో నారు పెంపకం

ఆధునిక పరిజ్ఞానం కూరగాయల్లో నారు పెంపకానికి పనికి వస్తున్నది. హైబ్రిడ్ కూరగాయల విత్తనాల ధర చాలా ఎక్కువ. ఒక్క గ్రాము విత్తనం ధర రూ. 35 నుంచి 70 రూపాయల వరకు ఉన్న ది. సంప్రదాయ పద్ధతిలో కూరగాయల నారు చేపట్టినప్పుడు నారు కుళ్లు సమస్య, మృత్తికా సమస్యలతో నారు చనిపోవడం, ఎదుగుదల లేకపోవడంతో నష్టం జరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ప్లగ్ ట్రే పరిజ్ఞానంతో ప్రయోజనాలు అనేకం.

పెంచే విధానం

ప్లగ్ ట్రేలలో ముందుగా కోకోపీట్/కొబ్బరిపీచు బాగా చివికినది నింపాలి. అలా నింపిన ప్లగ్ ట్రేల మధ్యలో వేలితో చిన్న గుంత చేయాలి. దాంట్లో ఒక్క గింజ నాటాలి. ఆ తర్వాత కొబ్బరి పీచుతో కప్పాలి. కొబ్బరి పీచు 300 నుంచి 400 శాతం నీటిని నిలుపుకు నే సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి వెంటనే విత్తనాలకు నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటను బట్టి 10 ట్రేలను ఒకదానిపైన మరొకటి పెట్టవచ్చు. అయితే ట్రేలలో నింపేదుకు వాడే కోకోపీట్‌ను వేప చెక్క లేదా విత్తనశుద్ధి శిలీంధ్ర నాశనులతో శుద్ధి చేయాలి. ఒక్కో ట్రే నింపటానికి ఒక కిలో నుంచి 1200 గ్రాముల కోకోపీట్ అవసరం ఉంటుంది. విత్తనం నాటిన ట్రేలను 3 నుంచి 6 రోజుల పాటు చీకట్లో ఉంచాలి. లేదా ట్రేలపై పాలిథిన్ కవర్ కప్పితే చీకటి కల్పించవచ్చు. కోకోపీట్‌లోని తేమ కాపాడబడుతుం ది. మొలక వస్తుంటే వెంటనే ట్రేలను ఒక్కొక్కటిగా పరుచాలి. లేదంటే నారు మొక్కలు పొడుగ్గా, బలహీనంగా పెరుగుతాయి. ఆ తర్వాత ట్రేలను షేడ్‌హౌస్ లేదా నెట్‌హౌస్‌లలోనికి తరలించాలి.
cop
వాతావరణ పరిస్థితులను బట్టి ట్రేలలోని నారుపై రోజ్ క్యాన్‌తో ప్రతిరోజు నీటిని పిచికారీ చేయాలి. నారుకుళ్లు సోకకుండా శిలీంధ్ర నాశకాలు కలిపిన నీటితో ట్రేలను తడుపాలి. మొక్కలు 12,20 రోజుల్లో నీటిలో కరిగే ఎరువులు (పాలీసీడ్) ఒక లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నారు పెరుగుదల బాగుంటుంది. అలా పెరిగిన మొక్కలను ప్రధాన పొలంలో నాటే ముందు నీటిని ఆపివేసి, షేడ్ నెట్ నుంచి తొలిగించి గట్టి పరుచాలి. మొక్కలు పంట్టను బట్టి 21 రోజుల నుంచి 42 రోజుల్లో ప్రధా న పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి. విత్తనాలు మొలకెత్తిన 7 నుంచి 10 రోజుల్లో పురుగు మందులు పిచికారీ చేసి పురుగులు, వైరస్ వాహకాలను నిరోధించవచ్చు. మిరప, వంకాయ, టమాటా పంటలకు ప్లగ్ ట్రేలలో పెంపకం అత్యంత లాభదాయకం. క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాప్సికం నారును పెంచుకోవచ్చు.

ప్రధాన లాభాలు

-మొలక శాతం చాలా ఎక్కువ
-మొక్కల్లో నారు కుళ్లు సమస్య ఉండదు
-వేరు అభివృద్ధి చాలా ఎక్కువ
-ప్రధాన పొలంలో నాటిన తర్వాత వెంటనే నాటుకుంటాయి.
-నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి దిగుబడి, నాణ్యత ఎక్కువగా ఉంటుంది.
Githa

462
Tags

More News