వరిలో సస్యరక్షణ చర్యలు

Wed,March 28, 2018 11:06 PM

ప్రస్తుతం యాసంగి వరి పైరు పూత దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉన్నది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రివేళలో మంచు కురియడం వల్ల కొన్ని జిల్లాల్లో సుడిదోమ, కాండం తొలిచే పురుగు, మెడ విరుపు తెగులుతో పాటు గింజలు నల్లబడుతున్నాయి. కాబట్టి రైతులు తమ వరి పొలంలో పురుగు/తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనించి కింది సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
-సుడిదోమ నివారణకు డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రా/లీ లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రా/లీ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
-కాండం తొలిచే పురుగు నివారణకు కార్టాప్‌హైడ్రోక్లోరైడ్ 50 శాతం ఎస్‌పి 2.0 గ్రా/లీ లేదా క్లోరాంట్రానిల్‌ప్రోల్ 0.3 మి.లీ/లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
-గింజ మచ్చ తెగులు నివారణకు గాను ప్రొపికొనజోల్ 1.0 మి.లీ/లీ లేదా కార్బండిజమ్+మ్యాంకోజెబ్ కల్గిన మిశ్రమ శిలీంధ్ర నాశిని 2.5 గ్రా/లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
-మెడ విరుపు తెగులు (అగ్గితెగులు) నివారణకు గాను కాసుగామైసిన్ 2.5 మి.లీ/లీ లేదా ఐసోప్రోథైయలోన్ 1.5 మి.లీ/లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
-చాలాచోట్ల ఈనిన వరి పొలాల్లో తాలు పోవడం/గింజకట్టకపోవడం జరుగుతున్నది. పొట్ట దశ నుంచి పూత పూర్తి చేసుకునే వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెం.గ్రే కన్నా తగ్గినప్పుడు , రాత్రి, పగటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉండటం, పూత దశలో నీటి ఎద్దడికి లోనైప్పుడు లేదా గింజ మచ్చ తెగులును కలుగజేసే శిలీంధ్రాలు ఆశించడం దీనికి ప్రధాన కారణం. ఇవే గాకుండా ఈ మధ్య కాలంలో ఆలస్యంగా నాటిన వరిలో వరి ఈగ ఉధృతి బాగా ఎక్కువ మొత్తంలో రావడం వల్ల కంకులు బైటికి వచ్చినప్పుడు తాలు గింజలుగా మారుతున్నాయి.
-ఈ వరి ఈగ నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 శాతం ఎస్‌పి 2.0 గ్రా/ లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
jagadishwar

272
Tags

More News