చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. సరైన సక్సెస్ను అందుకోలేకపోతున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ వంటి ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ ఏవీ లేవు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని మరి హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్తో కలిసి మోసగాళ్లు సినిమాతో వచ్చాడు. కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణుకు సోదరిగా నటించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కూడా విష్ణుకు సక్సెస్ రుచి చూపించలేకపోయింది. ప్రస్తుతం మా ఎన్నికల బరిలో నిలిచిన మంచు విష్ణు.. నామినేషన్ వేయబోతున్నట్లుగా ట్విటర్లో ఒక లేఖ విడుదల చేశారు. మా కుటుంబ సభ్యుల భావాలు, బాధలు తనకు బాగా తెలుసునని ఆ లేఖలో పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందామని సూచించారు.