హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నిర్వహిస్తున్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ డేటా ప్రకారం మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కాప్రా ఏరియాలో 68 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి. సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాలలో వరుసగా 20.8 మిమీ, 21.8 మిమీ వర్షపాతం నమోదైంది. నగరంలో చాలా ప్రాంతాల్లో 0.1 మిమీ నుండి 15.5 మిమీ వరకు వర్షపాతం నమోదైంది.