e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News పేదలకు అండగా కల్యాణలక్ష్మి

పేదలకు అండగా కల్యాణలక్ష్మి

పేదలకు అండగా కల్యాణలక్ష్మి

ఎలిగేడు, ఏప్రిల్‌ 1: పేద కుటుంబాలకు అండగా ఉండేందుకే సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మందికి రూ. 39,04,524 మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు గురువారం ఆ యన పంపిణీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే రూ. 12.60 లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులతో వైకుంఠధామానికి వెళ్లే సీసీ రోడ్డు పనులను ప్రారంభించా రు. ఇక్కడ జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, విండో చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంపీవో అనిల్‌రెడ్డి, డీటీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాడ కొండాల్‌రెడ్డి, సర్పంచులు బూర్ల సింధూజ, సింగిరెడ్డి ఎల్లవ్వ, పెద్దోల్ల అయిలయ్య, గొల్లె కావేరి, దేవరనేని ప్రభావతి, అర్శనపల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచులు కోరుకంటి వెంకటేశ్వరరావు, సబ్బు శ్రీధర్‌, ఆకుల హరీశ్‌గౌడ్‌, చీకటి శైలజ, ఎంపీటీసీలు కొత్తిరెడ్డి ప్రేమలత, ఇరుగురాల సావిత్రమ్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, మాజీ అధ్యక్షుడు తానిపర్తి మోహన్‌రావు, నాయకులు గొల్లె భూమేశ్‌, బద్దం తిరుపతిరెడ్డి, కల్లెం శ్రీనివాసరెడ్డి, మండిగ రాజనర్సయ్య, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు కలీల్‌ తదితరులున్నారు.
వ్యాక్సిన్‌పై భయాందోళనలు వద్దు
కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై భయాందోళనలు వద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎలిగేడులోని పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు తానిపర్తి మోహన్‌రావు తదితరులున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లికమాన్‌, ఏప్రిల్‌ 1: చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. చలివేంద్రాన్ని శ్రీనిధి చిట్‌ ఫండ్స్‌, శ్రీ వెంకటేశ్వర వాటర్‌ ప్లాంట్‌, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యుల సహకారంతో ఏ ర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, డాక్టర్‌ అజిజ్‌, ఫహీం, అన్వేశ్‌, వెంకట్‌రెడ్డి, కార్యదర్శి రాజు, శంకరయ్య, అశోక్‌, జగన్‌, వెంకటేశ్వర రావు, సలీమ్‌ ఖాన్‌, రాజు, కొమురయ్య, లక్ష్మయ్య, కృష్ణారెడ్డి, రవీందర్‌, సతీశ్‌, రమేశ్‌, మల్లేశ్‌ ఉన్నారు.

ఇవి కూడా చుడండి

పొద్దున్నే లేస్తే.. శుభోదయం!

ముఖంపై గోధుమరంగు మచ్చలు.. బైబై చెప్పేందుకు చిట్కాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదలకు అండగా కల్యాణలక్ష్మి

ట్రెండింగ్‌

Advertisement