పెద్దపల్లి జంక్షన్: చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, జడ్పీటీసీ రామ్మూర్తి, జడ్పీ సీఈవో శ్రీనివాస్, ఇన్చార్జి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్‌కుమార్, డీఈవో మాధవి, టీఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.