గోదావరిఖని : మహిళా చైతన్యానికి ప్రతీక, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. రజకుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, రజక సంఘం నాయకులు పైడిపల్లి తిరుపతి, మామడి సతీశ్, బండి లక్ష్మణ్, దేవయ్య, పోచయ్య, రాజయ్య, కొండయ్య, మహేశ్, కనకయ్య, రవి, వైనాల సతీశ్ తదితరులున్నారు.