e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జిల్లాలు దేశానికి ఆదర్శం ‘దళిత బంధు’

దేశానికి ఆదర్శం ‘దళిత బంధు’

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
పలు మండలాల్లో పర్యటన

జూలపల్లి, జూలై 26: దళిత కుటుంబాల ఉజ్వల భవిష్యత్‌ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపొందిస్తున్న ‘దళిత బంధు’ పథకం దేశానికి ఆదర్శంగా నిలువనున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం మండలస్థాయి సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు 255 కొత్త రేషన్‌ కార్డులు, 50 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే రూ. లక్షా 37 వేల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల బతుకుల్లో వెలుగులు నింపాలని కేసీఆర్‌ సంకల్పించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్‌, ఏఎంసీ చైర్మన్‌ కంది చొక్కారెడ్డి, వైస్‌ ఎంపీపీ మొగురం రమేశ్‌, సర్పంచులు దారబోయిన నరసింహం, మేచినేని సంతోష్‌రావు, వీర్ల మల్లేశం, బంటు ఎల్లయ్య, మాం కాలి తిరుపతి, కుంటూరి రాజయ్య, రేశవేని రాధ, కొత్త శకుంతల, కూసుకుంట్ల మంగ, ఎంపీటీసీ సభ్యులు దండె వెంకటేశం, తమ్మడవేని మల్లేశం, పల్లె స్వరూప, సింగిల్‌ విండో చైర్మన్లు కొంజర్ల వెంకటయ్య, పుల్లూరి వేణుగోపాల్‌రావు, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ విశారపు వెంకటేశం, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీవో రమేశ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య పాల్గొన్నారు.
ఎలిగేడు, జూలై 26: ఎలిగేడులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మండలంలోని 316 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, 15 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇక్కడ జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, ఎలిగేడు సింగిల్‌ విండో అధ్యక్షుడు గోపు విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, తహసీల్దార్‌ పద్మావతి, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంపీవో అనిల్‌రెడ్డి, డీటీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, సర్పంచులు బూర్ల సింధూజ, మాడ కొండాల్‌రెడ్డి, రాచర్ల కొండయ్యరాజా, అర్శనపెల్లి వెంకటేశ్వరరావు, దుగ్యాల శ్వేత, తంగెళ్ల స్వప్న, సింగిరెడ్డి ఎల్లవ్వ, గోపు విజేందర్‌రెడ్డి, చిలుముల సౌమ్య, పెద్దోల్ల అయిలయ్య, గొల్లె కావేరి, ప్రభావతి, కో-ఆప్షన్‌ మెంబర్‌ ఖలీల్‌, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తాటిపెల్లి సతీశ్‌బాబు, మోహన్‌రావు, రాజనర్సయ్య, బూర్ల సత్యనారాయణ, బద్దం తిరుపతిరెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులున్నారు.
పెద్దపల్లి రూరల్‌/ పెద్దపల్లి జంక్షన్‌ జూలై 26: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణ, రాఘవాపూర్‌ రైతు వేదికలో కొత్త రేషన్‌ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పెద్దపల్లి మండలం, పెద్దపల్లి పట్టణంలో కలిపి 530 రేషన్‌ కార్డులను అర్హులకు అందించామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, తహసీల్దార్‌ దుర్శెట్టి శ్రీనివాస్‌, పెద్దపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ నజ్మీన్‌ సుల్తానా మొబీన్‌, సర్పంచులు చీకటి స్వరూప పోచాలు, కారె శారద శ్రీనివాస్‌, అప్పన్నపేట సింగిల్‌ విండో చైర్మన్‌ దాసరి చంద్రారెడ్డి, ఉప సర్పంచ్‌ బోండ్ల శ్రీనివాస్‌, ఆర్‌ఐ భవానీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ..
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ర్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. పెద్దపల్లి మండలంలోని 47 మందికి రూ. 14, 43,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందించామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ ఎంపీపీ బండారి స్రవంతీశ్రీనివాస్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచులు శంకర్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana