బుధవారం 03 మార్చి 2021
Peddapalli - Feb 23, 2021 , 03:14:03

ఆలయానికి రూ.1.50 లక్షల విరాళం

 ఆలయానికి రూ.1.50 లక్షల విరాళం

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 22: సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని పూసాలలోని శంభులింగేశ్వరాలయానికి నల్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సరిపడా గ్రానైట్‌ అందించేందుకు రూ. లక్షా 50 వేల ఇవ్వ నున్నట్లు నల్ల మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అలయ నిర్వాహకులు సోమవారం నల్ల మనోహర్‌రెడ్డిని కలిసి ఆలయాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆలయాభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుర్రాల మల్లేశం, ఆర్‌బీఎస్‌ జిల్లా డైరెక్టర్‌ పురం ప్రేమ్‌చందర్‌రావు, మాటేటి గట్టయ్య, పురం రమణ తదితరులున్నారు. 

పెద్దపల్లి రూరల్‌, ఫిబ్రవరి 22: కొత్తపల్లిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెరుక అమృత కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.4 వేలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పల్లె సుందర్‌, మల్లయ్య, పెరుక రవి తదితరులున్నారు.

క్రికెట్‌ పోటీలు ప్రారంభం..

కాల్వశ్రీరాంపూర్‌, ఫిబ్రవరి 22: స్వామి వివేకానంద యువజన ఉత్సవాల సందర్భంగా మండలంలోని మల్యాలలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూల మాలవేసి మాట్లాడారు. యువత వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన జట్టుకు రూ.20వేలు, ద్వితీయ బహుమతి సాధించిన జట్టుకు రూ.10 వేలు నల్ల ఫౌండేషన్‌ ద్వారా నగదు బహుమతి అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లంక రాజేశ్వరి, ఎంపీటీసీ రావి సదానందం, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, కాల్వశ్రీరాంపూర్‌ ఉప సర్పంచ్‌ సుధాటి కర్ణాకర్‌రావు, జూలపల్లి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పాటకుల అనిల్‌, నాయకులు దాసరి నరేందర్‌, సువర్ణ బిట్టు, జ్ఞానేంద్రాచారి, పంజాల సురేశ్‌, పిన్నింటి లక్ష్మణ్‌రెడ్డి, నగేశ్‌, నిర్వాహకుడు కనవేన విజేందర్‌ తదితరులున్నారు. 

VIDEOS

logo