శనివారం 27 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 28, 2021 , 02:59:05

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే పోటీలు

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే పోటీలు

మంథని టౌన్‌, జనవరి 27: ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో యువకులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. మంథని  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో మూ డు రోజులపాటు గోదావరిఖని సబ్‌ డివిజన్‌ లెవల్‌ కబడ్డీ పోటీలు నిర్వహించారు. బుధవారం ఫైనల్‌ కబడ్డీ పోటీలకు సీపీ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పీఈటీలు, పీడీలను సీపీ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌, సీఐ ఆకునూరి మహేందర్‌, ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, ఎస్‌ఐ ఓంకార్‌యాదవ్‌ తదితరులున్నారు.

VIDEOS

logo