శనివారం 27 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 28, 2021 , 02:59:04

ఊర చెరువుకు పైపులైన్‌ వేయించాలి

ఊర చెరువుకు పైపులైన్‌ వేయించాలి

పెద్దపల్లి జంక్షన్‌, జనవరి 27: పెద్దపల్లి మండలం కొత్తపల్లి పరిధిలో హుస్సేన్‌మియావాగు  చెక్‌ డ్యామ్‌ నుంచి ఊర చెరువుకు పైపులైన్‌ వేయించాలని ఆ గ్రామ యువకులు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో విన్నవించారు. ఊర చెరువును నింపితే యాసంగిలో దాదాపు 200 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఎమ్మెల్యే స్పందించి వేస్తామని హామీ ఇచ్చినట్లు యువకులు వివరించారు. ఇక్కడ బాలసాని లెనిన్‌, తిరుమలేశ్‌, శీలారపు మహేశ్‌, శీలారపు శ్రీధర్‌ ఉన్నారు.


VIDEOS

logo