మంగళవారం 09 మార్చి 2021
Peddapalli - Jan 28, 2021 , 02:59:04

రాయపేట రిజర్వాయర్‌ నుంచి నీటిని ఇవ్వాలి

రాయపేట రిజర్వాయర్‌ నుంచి నీటిని ఇవ్వాలి

కాల్వశ్రీరాంపూర్‌, జనవరి 27: రాయపేట రిజర్వాయర్‌ నుంచి సాగునీరు ఇవ్వాలని రైతులు ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. హుస్సేన్‌మియా వాగును నమ్ముకొని తాము పంటలను వేసినట్లు శంకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.  వెంటనే స్పందించిన ఐడీసీ చైర్మన్‌ రాయపేట రిజర్వాయర్‌ నుంచి నీళ్లు విడుదల చేయించారు. రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శంకర్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతులు శంకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతు లు రాజనర్సు, సదయ్య, పాల ఎల్లయ్య, రాజకొండ రాజయ్య, చిలువేరు రాజయ్య, ఓదెలు తదితరులున్నారు.

VIDEOS

logo