మంగళవారం 02 మార్చి 2021
Peddapalli - Jan 27, 2021 , 03:21:09

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

  • ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు
  • ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందుకున్న ఉత్తమ ఉద్యోగులు

పెద్దపల్లి నమస్తే నెట్‌వర్క్‌, జనవరి 26: జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా కేంద్రంలోని అన్ని వాడల్లో వేడుకలు ఘనంగా జరుపుకోగా, పలు చోట్ల పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దాసరి మమతారెడ్డి జెండాను ఆవిష్కరించారు. జిల్లా గ్రంథాలయ కార్యాలయ ఆవరణలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జి.రఘువీర్‌సింగ్‌ జెండా ఎగురవేశారు. రామగుండం బల్ది యా కార్యాలయ ఆవరణలో కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ జెండాను ఆవిష్కరించగా మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు జెండాకు వందనం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో రూ.65లక్షలతో 150అడుగుల ఎత్తులో జాతీ య జెండాను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్‌ ప్రకటించారు. ప్రధాన చౌరస్తాలోని ఆటో డ్రైవ ర్స్‌ యూనియన్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గోదావరిఖనిలోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. గోదావరిఖనిలోని ఆరో అదనపు జిల్లా న్యాయస్థానంలో ఆరో అదనపు న్యాయమూర్తి భారతిలక్ష్మి, గోదావరిఖని మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌లో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి జెండాను ఆవిష్కరించారు. టౌన్‌షిప్‌లోని మహాత్మాగాం ధీ స్టేడియంలో ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌కుమార్‌ జెండాను ఎగురవేశారు. ముందుగా సీజీఎం పరేడ్‌ మైదానంలో ప్రత్యేక వాహనంలో పర్యటించి ఎన్టీపీసీ సీఐఎస్‌ఎఫ్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేదికపై కంపెనీలో వివిధ విభాగాల్లో విశేష కృషి చేసిన  45మంది ఉద్యోగులకు బిజినెస్‌ యూనిట్‌ హెడ్‌ మెరిటోరియస్‌ అవార్డులను అందజేశారు. ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టౌన్‌షిప్‌ మెయిన్‌ గేట్‌ సమీపంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ హాజరై జెండాను ఎగురవేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఆవరణలో జీఎం కే.నారాయణ ఎస్‌ అండ్‌ పీసీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ-2 జీఎం కార్యాలయంలో జీఎం ఎం.సురేశ్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్జీ-3, ఏపీఏ ఏరియా, జీ ఎం కార్యాలయాల్లో జీఎం సూర్యనారాయణ, ఏపీఏ జీఎం ఎన్‌వీకే శ్రీనివాస్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, సుల్తానాబాద్‌, రామగిరి, అంతర్గాం, పాలకుర్తి, మంథని, కమాన్‌పూర్‌, ముత్తారం తదితర మండలాల్లో వేడుకలు నిర్వహించగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, ఏఎంసీ, విండో చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, ఆయా పార్టీల నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. 


VIDEOS

తాజావార్తలు


logo