గురువారం 25 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 26, 2021 , 02:05:56

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

మంథని టౌన్‌, జనవరి 25: మండలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీపీ కొండ శంకర్‌ తెలిపారు. ఎంపీపీ కొండ శంకర్‌ అధ్యక్షతన స్థానిక మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సహాయ సహకారాలతో మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు,  అధికారులు మిషన్‌ భగీరథ నీటిని తాగి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక్కడ ఎంపీడీవో వెంకటచైతన్య, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ తదితరులున్నారు.

VIDEOS

logo