మంగళవారం 02 మార్చి 2021
Peddapalli - Jan 25, 2021 , 02:42:01

కార్యకర్త కుటుంబానికి అమాత్యుడి అండ

కార్యకర్త కుటుంబానికి అమాత్యుడి అండ

  • రూ. 86వేల ఆర్థిక సాయం చేసిన కొప్పుల 

ధర్మారం, జనవరి 24: అర్ధంతరంగా మృతి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుటుంబానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అండగా నిలిచారు. రూ. 86 వేల ఆర్థిక సాయం చేసి భరోసానిచ్చారు. ధర్మారం మండలకేంద్రానికి చెందిన పార్టీ కార్యకర్త శ్రీకాంత్‌ ఈ నెల 16న ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి కొప్పుల.. శ్రీకాంత్‌ తల్లిదండ్రులు బాబక్క-మల్లయ్యను పరామర్శించారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆదివారం శ్రీకాంత్‌ దినకర్మ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల నాయకుల ద్వారా నగదును అతడి తల్లిదండ్రులకు అందజేశారు. గొప్ప మనుసుతో సాయం చేసిన మంత్రి ఈశ్వర్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ సర్పంచ్‌ పూస్కూరు జితేందర్‌రావు, నంది మేడారం ప్యాక్స్‌ చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీ రాంబాబు, టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌వై మండలాధ్యక్షులు పెంచాల రాజేశం, రాచూరి శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి దేవి నళినీకాంత్‌, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం తిరుపతి, దేవి అజయ్‌ తదితరులు ఉన్నారు.


VIDEOS

logo