కార్యకర్తలను కాపాడుకుంటాం..

- రామగుండం ఎమ్మెల్యే చందర్
యైటింక్లయిన్ కాలనీ, జనవరి 24: టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు దుర్గం రాజేశం అధ్యక్షతన సీఈఆర్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముందు గా ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి షిర్కే బస్టాండ్ నుంచి సీఈఆర్ క్లబ్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమై ఖ్య పాలనలో మూతపడిన అంతర్గాం పరిశ్రమను త్వరలోనే ప్రారంభించి ఇండస్ట్రీయల్ కారిడార్‌గా మార్చి వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఐటీ పార్కు, ఐటీ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కార్పొరేటర్లు సాగంటి శంకర్, బదావత్ శంకర్‌నాయక్, తాళ్ల అమృత రాజయ్య, బాదె అంజలీదేవి భూమయ్య, టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు అయిలి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి గోపాల్‌రావు, జక్కుల దామోదర్‌రావు, ఎండీ గౌస్‌పాషా, రౌతు రమేశ్, పులి రాకేశ్, సారయ్య నాయక్, గూడెల్లి రాంచందర్, పోగుల వీరారెడ్డి, ముస్కె శ్రీనివాస్, నల్ల మధుకర్‌రెడ్డి, మారెల్లి మల్లారెడ్డి, బండ రమేశ్‌రెడ్డి, బైరి నాగమణి, ఎండీ రహీం, ముక్కెర మొగిలి, బాదె రవితేజ తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని, జనవరి 24: మార్కండేయ కాలనీలో కోలాట నృత్యోత్సవ వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆవిష్కరించారు. ఫిబ్రవరి 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జేఎన్ స్డేడియంలో వేంకటేశ్వరస్వా మి కల్యాణాన్ని నిర్వహించనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ మేయర్ అనిల్‌కుమార్, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, అడ్డాల స్వరూప, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, బొడ్డు రవీందర్, శ్రీనివాస్, నూతి తిరుపతి, కళావతి, వంశీకృష, మేడి తిరుపతి, శాస్త్రి ఉన్నారు. ఈనెల 29న విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరుకంటి ప్రీమియర్ లీగ్ కేటీఆర్ గోల్డ్ కప్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు గోదావరిఖనిలోని ఓ ఫంక్షన్ హాల్లో క్రికెట్ పోటీల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. విజేత జట్టుకు రూ.50,116, రన్నరప్ జట్టుకు రూ.25,116 నగదు బహుమతి అందిస్తామని వెల్లడించారు. క్రికెట్ పోటీల్లో పాల్గొనే వారు 98857 30490, 93948 55188 సెల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. స్థానిక మార్కండేయ కాలనీలో ఆయుర్వేద వైద్యశాల, ఫార్మసీ దుకాణాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యఖ్రమంలో కార్పొరేటర్లు పెంట రాజేశ్, మంచికట్ల దయాకర్, మేకల సదానందం, బాల రాజ్‌కుమార్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, బొడ్డు రవీందర్, కొలిపాక మధుకర్ రెడ్డి, అచ్చ వేణు, చెల్కలపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, ఇనుముల సత్యం, కౌటంబాబు, గోలివాడ ప్రసన్న ఉన్నారు.
తాజావార్తలు
- జాన్వీ అందాలకు ఫిదా కాని వారు ఉంటారా..!
- పత్తి సాగు విస్తీర్ణంలో సెకండ్ ప్లేస్‌లో తెలంగాణ
- అంతర్గాలం
- మళ్లీ గ్రే లిస్ట్‌లోనే పాక్
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్‌నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..