శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 25, 2021 , 02:30:07

యువత ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి

యువత ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి

మంథని టౌన్‌, జనవరి 24: యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, ఆ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకుసాగాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సూచించారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలోని మంథనిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సబ్‌ డివిజనల్‌ లెవల్‌ కబడ్డీ పోటీలను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. యువత ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పెద్దపల్లి డీసీపీ  రవీందర్‌ మాట్లాడుతూ.. అ సాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడంతోపాటు యువత కోసం తమవంతుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన టీ వెంకటమ్మకు మంజూరైన రూ. 17,500 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును పుట్ట మధు లబ్ధిదారురాలికి అందజేశారు. అనంతరం తెలంగాణ బొగ్గు గని కాంట్రాక్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ క్యాలెండర్‌ను ఆ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అలాగే పట్టణంలోని గాంధీచౌక్‌లో ఏర్పాటు చేసిన హెల్త్‌ కేర్‌ సెంటర్‌ను జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సందర్శించారు. వేర్వేరు గా జరిగిన కార్యక్రమాల్లో ఇక్కడ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ, సీఐ ఆకునూరి మహేందర్‌, ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, మంథని, రామగిరి, ముత్తారం మండలాల ఎస్‌ఐలు ఓంకార్‌యాదవ్‌, మహేందర్‌, నరసింహారావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్‌ వీకే రవి, నాయకులు కుంట శ్రీనివాస్‌, ఆకుల కిరణ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులున్నారు. 

VIDEOS

logo