క్రీడాపోటీలు.. సేవా కార్యక్రమాలు

పెద్దపల్లి జంక్షన్, జనవరి 24: ఉమెన్స్ స్పోర్ట్ డేను పురస్కరించుకొని పట్టణంలోని సుభాష్‌నగర్‌లో జమాతే ఇస్లామీ హింద్ ఉమెన్స్ వింగ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు ఆటలపోటీలు నిర్వహించారు. స్థానిక క్రిసెంట్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలను మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి ప్రారంభించి, పలు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నజ్మీనా సుల్తాన, కౌన్సిలర్ ఉనుకొండ సుజాత, టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.
ఎలిగేడు, జనవరి 24: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా లాలపల్లి గ్రామంలో ఎర్త్ చైల్డ్‌లైన్ 1098 జిల్లా కో-ఆర్డినేటర్ ఉమాదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇక్కడ గ్రామ సర్పంచ్ సింతిరెడ్డి ఎల్లవ్వ, ఎలిగేడు ఎంపీపీ తానిపర్తి స్రవంతి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తానిపర్తి మోహన్‌రావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ సూర్యకళ, రైతు సంఘం గ్రామాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జూలపల్లి పోలీస్ షీ టీం, సఖీ కేంద్ర సభ్యులు స్వప్న, అశ్రిత, రమాదేవి, అంగన్వాడీ కార్యకర్త వసంత పాల్గొన్నారు.
సుల్తానాబాద్, జనవరి 24: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శ్రీసేవ మార్గ్ స్వచ్ఛంద సంస్థ పట్టణాధ్యక్షురాలు మునిపల్లి ప్రణిత ఆధ్వర్యంలో విద్యా ర్థులకు స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. ఇక్కడ తుమ్మ రాజ్‌కుమార్, సంస్థ ప్రతినిధులు, కావ్య, తేజ, శెట్టి శ్రీనివాస్, సాయిచందర్, నిషాంత్ ఉన్నారు.
పెద్దపల్లి జంక్షన్/పెద్దపల్లి టౌన్ జనవరి 24: పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలోని దివ్యాంగులకు మససు సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం లో పండ్లు, బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఇక్కడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బొడ్డుపలి శ్రీనివాస్, భూతగడ్డ సంపత్ తదితరులు ఉన్నారు. అలాగే పట్టణంలోని భరత్‌నగర్‌కు చెందిన కావేటి పుల్లయ్య తన పెద్దమ్మ నందమ్మ జ్ఞాపకార్థం నిత్యావసరాలను అందజే శారు. ఇక్కడ కౌన్సిలర్ బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, మాజీ ఎంపీటీసీ తదితరులు ఉన్నారు.
జ్యోతినగర్(రామగుండం), జనవరి 24: బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండంలోని తబితా ఆశ్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఇక్కడ సంస్థ సభ్యులు వీ రాజశేఖర్, కే హరీశ్, కార్తీక్, ఎన్ లక్ష్మణ్, నిర్వాహకుడు వీరేందర్ నాయక్ ఉన్నారు.