మంగళవారం 02 మార్చి 2021
Peddapalli - Jan 24, 2021 , 04:05:24

మంథని గ్రౌండ్‌ను అభివృద్ధి చేస్తాం

మంథని గ్రౌండ్‌ను అభివృద్ధి చేస్తాం

జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ 

రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

మంథని టౌన్‌: మంథనిలోని క్రీడా మైదానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇంటర్నేషనల్‌ స్థాయి గ్రౌండ్‌గా మారుస్తామని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ తెలిపారు. ముత్కుల నరేశ్‌ స్మారకార్థం మంథని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను జడ్పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మధూకర్‌ మాట్లాడుతూ.. స్నేహితుడి జ్ఞాపకార్థం పెద్ద ఎత్తున టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. నాడు మంథని క్రీడా మైదానంలో వాకింగ్‌కు రావాలంటే పందులు దర్శనమిచ్చేవని గుర్తు చేశారు. ఆరేండ్ల తమ పాలనలో రూ. 3కోట్లతో రెండు నూతన భవనాలు నిర్మించామన్నారు. టోర్నీ మొదటి బహుమతిని పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, ఎస్‌ఐ ఓంకార్‌యాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు యాకూబ్‌, కౌన్సిలర్లు వీకే రవి, సమ్మయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు బత్తుల సత్యనారాయణ, వేల్పుల గట్టయ్య, సామ్రాట్‌, వంశీ, క్రికెట్‌ టోర్నీ ఆర్గనైజర్లు కాపు అనిల్‌, బోగె రాజు, బండ బానేశ్‌, మచ్చ రమేశ్‌, గుజ్జుల శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

బ్యాటింగ్‌ చేస్తూ.. బౌలింగ్‌ చేస్తూ.. 

నిత్యం ప్రజా, ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ.. బిజీగా గడిపే జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ దంపతులు క్రికెట్‌ ఆడారు. మధూకర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా, పుట్ట శైలజ బౌలింగ్‌ చేశారు.

చెక్కు అందజేత

కమాన్‌పూర్‌కు చెందిన కోరె పర్వతాలు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందగా, అతడి భార్య దుర్గమ్మకు విద్యుత్‌శాఖ ద్వారా మంజూరైన రూ. 5లక్షల చెక్కును జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అందజేశారు. కార్యక్రమంలో ఏడీ వెంకటేశ్వర్‌రావు, డీఈ తిరుపతి, ఏఈ రాజేంద్రకుమార్‌, సబ్‌ ఇంజినీర్‌ సతీశ్‌ ఉన్నారు.


VIDEOS

logo