ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 24, 2021 , 04:05:22

బ్యాక్‌ వాటర్‌ సమస్యల పరిష్కారానికి కృషి

బ్యాక్‌ వాటర్‌ సమస్యల పరిష్కారానికి కృషి

గోదావరిఖని, జనవరి 23: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. స్థానిక ఎల్లందు క్లబ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ, ఇరిగేషన్‌ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ కారణంగా దెబ్బతిన్న రోడ్డు ఎస్‌టీపీల నిర్మాణానికి రూ.15 కోట్లు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు డిపాజిట్‌ చేయాలన్నారు. బ్యాక్‌ వాటర్‌ కారణంగా దెబ్బతిన్న పొలాల్లో మట్టి నింపాలని, లేదంటే భూసేకరణ చేసి నష్ట పరిహారం అందించాలని కోరారు. అంతర్గాం మండలం ఎల్లంపల్లి లిఫ్ట్‌ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముంపునకు గురవుతున్న గోదావరినది సమీపంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెలను నూతనంగా నిర్మించాలని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి దాకా బీటీ రోడ్డు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో కాళేశ్వరం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, మేయర్‌ అనిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు తదితరులున్నారు 


VIDEOS

logo