సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మంథని టౌన్,జనవరి 21: పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీఆర్ఎస్ నాయకులు మంథనిలో శుక్రవారం పంపిణీ చేశారు. పట్టణంలోని బోయినిపేటకు చెందిన అంబట్ శ్రావణ్‌కు రూ. 20వేలు, వాసవినగర్‌కు చెందిన అనంతుల సత్యనారాయణకు రూ.12,500, మజీద్‌వాడకు చెందిన కొండపర్తి మణెమ్మకు రూ. 35వేలు, పోచమ్మవాడకు చెందిన పుప్పాల స్వప్నకు రూ. 60వేలు, ఎల్లంకి కవితకు రూ. 54వేల విలువైన చెక్కులు మం జూరు కాగా, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ఆదేశాల మేరకు పంపిణీ చేశామని నాయకులు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు గర్రెపల్లి సత్యనారాయణ, కాయితి సమ్మయ్య, పద్మ, లక్ష్మి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, నాయకుడు ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామగిరి, జనవరి 21: సుందిళ్లకు చెందిన బూర్ల నవ్యకు రూ. 15,500విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుకాగా, లబ్ధిదారురాలికి సర్పంచ్ దాసరి లక్ష్మి గురువారం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దాసరి రాయలింగు, రాజిరెడ్డి, తిరుపతి ఉన్నారు.
కమాన్‌పూర్: సిద్దిపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆ గ్రామానికి చెందిన మాటేటి రాయమల్లుకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ, 27,500 విలువైన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, సర్పంచ్ తాటికొండ శంకర్, నాయకులు బంగారు గట్టయ్య, రాచకొండ రవి, గుర్రం లక్ష్మీమల్లు, జాబు శ్రీనివాస్, సాన సురేశ్, మాటేటి కుమారస్వామి తదితరులున్నారు.
జూలపల్లి, జనవరి 21: అబ్బాపూర్ గ్రామానికి చెందిన కచ్చు మానసకు రూ. 37,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు దండె వెంకటేశం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్లాల కనుకరాజ్, కచ్చు బీరయ్య, చొప్పరి సతీశ్, చొప్పరి కొమురయ్య, చొప్పరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.