గురువారం 25 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 22, 2021 , 01:23:39

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

ధర్మారం, జనవరి21: క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. కటికెనపల్లిలో సర్పంచ్‌ కారుపాకల రాజయ్య తల్లిదండ్రులు లచ్చవ్వ-రాములు జ్ఞాపకార్థం నియోజక వర్గస్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహించగా, కమ్మర్‌ఖాన్‌పేట జట్టు విజేతగా, కటికెనపల్లి జట్టు రన్నర్‌గా నిలిచాయి. బుధవారం రాత్రి బహుమతుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ, నిత్యం సాధన చేయడంతో యువత ఆటల్లో రాణిస్తారని వివరించారు. కార్యక్రమానికి సర్పంచ్‌ అధ్యక్షత వహించగా, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్‌ చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సూరమల్ల శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ రామడుగు గంగారెడ్డి తదితరులున్నారు.

క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి

రామగిరి, జనవరి 21: ఆటగాళ్లు తమ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ పేర్కొన్నారు. గోదావరిఖని పోలీస్‌ సబ్‌ డివిజనల్‌ ఆధ్వర్యంలో సెంటినరీకాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా మైదానంలో చేపట్టిన క్రికెట్‌ పోటీల్లో గెలుపొందిన జట్టుకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. గెలుపొందిన మంథని జట్టుకు నగదుతోపాటు బహుమతి, రన్నర్‌గా పన్నూరు జట్టుకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ శారద, ఏఎంసీ చైర్మన్‌ సత్యనారాయణ గౌడ్‌, రామగిరి ఎస్‌ఐ మహేందర్‌, సర్పంచ్‌ అల్లం పద్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శెంకేసి రవీందర్‌ తదితరులున్నారు. 

కాల్వశ్రీరాంపూర్‌, జనవరి21: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ కప్‌ పేరిట పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలను  సీఐ సందర్శించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన మ్యాచ్‌లను టాస్‌వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవి, ఎంపీటీసీ మాదాసి సువర్ణ తదితరులు పాల్గొన్నారు. 

అలాగే రామగుండం సీపీ ఆదేశాల మేరకు కాల్వశ్రీరాంపూర్‌లోని యువకులకు ఎస్‌ఐ వెంకటేశ్వర్‌ వాలీబాల్‌ కిట్‌, టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హైస్కూల్‌ హెచ్‌ఎం రమేశ్‌, సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవి, ఎంపీటీసీ సువర్ణ, నాయకులు ఆడెపు రాజు, మాదాసి రాంచంద్రం, యూత్‌ సభ్యులు తదితరులు ఉన్నారు. 

ఓదెల, జనవరి 21: కనగర్తిలో క్రికెట్‌ కప్‌ పోటీల్లో భాగంగా మ్యాచ్‌ను సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పొత్కపల్లి ఎస్‌ఐ లక్ష్మణ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ పల్లె కుమార్‌, ఆర్‌బీఎస్‌ జిల్లా డైరెక్టర్‌ ఆరెల్లి మొండయ్యగౌడ్‌, యూత్‌ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్‌, పాఠశాల హెచ్‌ఎం నరేంద్రాచారి, మాజీ వైస్‌ ఎంపీపీ పోతుగంటి రాజుగౌడ్‌, రవి, మణికంఠ, శ్రీకాంత్‌, రాము, ప్రవీణ్‌, సాగర్‌, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo