యువత సమాజానికి ఉపయోగపడాలి

- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
- కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
ఓదెల, జనవరి 20: యువత సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం కనగర్తి గ్రామం లో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు హాజరయ్యే యువకులకు బుక్స్, శిక్షణను ఇప్పించేందుకు సిద్ధం గా ఉన్నానని తెలిపారు. అభ్యర్థులు తనను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీటీసీ ఆరెల్లి సరోజన, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కావటి రాజుయాదవ్, జిల్లా డైరెక్టర్లు కందుల సదాశివ్, ఆరెల్లి మొండయ్యగౌడ్, వైస్ ఎంపీపీ పల్లె కుమార్, యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, సర్పంచులు ఆళ్ల రాజిరెడ్డి, పులుగు తిరుపతిరెడ్డి, కర్క మల్లారెడ్డి, గుండేటి మధు, టీఆర్ఎస్ నాయకులు ఆకుల మహేందర్, గోపు నారాయణరెడ్డి, పోతుగంటి రాజుగౌడ్, కనికిరెడ్డి సతీశ్, నోముల ఇంద్రారెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
- చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ 75 నిమిషాల సంభాషణ
- గజకేసరిగా యష్ ..సాయంత్రం చిత్ర టీజర్ విడుదల
- రెండు తలల దూడకు జన్మనిచ్చిన బర్రె.. ఎక్కడో తెలుసా?
- బీజేపీని సవాల్ చేస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీయే : కేజ్రీవాల్
- శ్రీవారికి పోస్కో భారీ విరాళం
- బ్రెజిల్‌కు రెండు కోట్ల కోవాగ్జిన్ టీకా డోసులు