శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 21, 2021 , 02:41:30

బాధితులకు జడ్పీ చైర్మన్‌ పరామర్శ

బాధితులకు జడ్పీ చైర్మన్‌ పరామర్శ

కమాన్‌పూర్‌, జనవరి 20: మండల కేంద్రంలో తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు కుక్క చంద్రమౌళి తండ్రి పోచయ్య ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ బుధవారం పరామర్శించారు. అలాగే కిష్టంపల్లెకు చెందిన కొసన కొమురయ్య మృతి చెందగా, సదరు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇనగంటి భాస్కర్‌రావు, మాజీ ఎంపీపీ రాంచంద్రంగౌడ్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఇంతియాజ్‌, ఎంపీటీసీ సభ్యుడు కోలేటి చంద్రశేఖర్‌, జూలపల్లి సర్పంచ్‌ బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌,  ఉప సర్పంచ్‌ బొజ్జ రాజసాగర్‌, నాయకులు కొట్టె భూమయ్య, రాచకొండ రవి, నీలం శ్రీనివాస్‌, జాబు సతీశ్‌, దండె కిషన్‌, కాస రవి, గుర్రం లక్ష్మీమల్లు, జంగపెల్లి చిన్న శ్రీనివాస్‌, మేడగోని విజయ్‌, కిరణ్‌ తదితరులున్నారు. 

ఓదెల, జనవరి 20: జీలకుంటలో దామెర లింగయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరామర్శించారు. ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఐరెడ్డి వెంకటరెడ్డి, వినకొండ అశోక్‌, ఆకుల మహేందర్‌, ఆళ్ల రాజిరెడ్డి, పత్తి సమ్మిరెడ్డి, రౌతు జలపతి, చర్లపల్లి సురేశ్‌గౌడ్‌, పోతుగంటి రాజుగౌడ్‌, రెడ్డి శ్రీనివాస్‌ తదితరులున్నారు.  

VIDEOS

logo