శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 21, 2021 , 02:39:34

శిక్షణను సద్వినియోగం చేసుకోండి

శిక్షణను సద్వినియోగం చేసుకోండి

  • ఆర్జీ-1 జీఎం కే నారాయణ 
  • తర్ఫీదు ప్రారంభం

గోదావరిఖని, జనవరి 20: ఆర్మీ ఉద్యోగాలకు ఇస్తున్న శిక్షణను అభ్యర్థులు సద్విని యోగం చేసుకోవాలని ఆర్జీ-1 జీఎం నారాయణ కోరారు. ఈమేరకు జేఎన్‌ స్టేడియంలో ఆర్మీ అభ్యర్థులకు ఉచిత శిక్షణను బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అ నంతరం  జీఎం మాట్లాడుతూ, మెరిట్‌ ప్రకారం క్వాలిఫై అయిన 50 మంది అభ్యర్థులకు 45 రోజులపాటు శారీరక దారుఢ్యంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సివిల్‌ డీజీఎం నవీన్‌, మదన్‌మోహన్‌, ఆంజనేయులు, డీవైపీఎంలు సలీం, సమ్మయ్య, సేవా కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ సారంగపాణి, సీనియర్‌ పీవో నరేశ్‌ చక్రవర్తి, డాక్టర్‌ మద్దిలేటి, సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, సూపర్‌వైజర్‌ రాపర్తి సమ్మయ్య, మేడి తిరుపతి ఉన్నారు. 

రామగిరి, జనవరి 20: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు సింగరేణి ఆర్జీ-3 ఆధ్వర్యంలో  ఉచిత శిక్షణను జీఎం సూర్యనారాయణ ప్రారంభించారు. స్థానిక సీఈఆర్‌ క్లబ్‌ ఆవరణలో ఆయన జెండా ఊపి ప్రారంభించి అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. శిక్షణకు 70 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వైద్య పరీక్షల్లో 50 మంది అర్హత సాధించారని వివరించారు. కార్యక్రమంలో డీజీఎం శ్రీనివాసులు, విలాస్‌ శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్‌ నాయకుడు గౌతం శంకరయ్య తదితరులున్నారు. 

యైటింక్లయిన్‌ కాలనీ,జనవరి 20 :ఆర్జీ-2 ఏరియా అబ్దుల్‌ కలాం క్రీడా మైదానంలో  ఉచిత ఆర్మీ శిక్షణ శిబిరాన్ని జీఎం సురేశ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌, టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌రావు, ఇన్‌చార్జి ఎస్‌వోటూ జీఎం వేణుగోపాల్‌, అధికార ప్రతినిధి ప్రదీప్‌ కుమార్‌, డీజీఎం(ప) రాజేంద్రప్రసాద్‌, అధికారులు పైడీశ్వర్‌, రామకృష్ణ, మురళీకృష్ణ, వంశీధర్‌, ఆర్మీ  శిక్షకులు హనిఫ్‌, సురేశ్‌, దేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo